వైరల్ వీడియో: సింహం నోట్లో వేలుపెట్టిన యువకుడు.. ఫింగర్ కట్ అయిపోయింది..

దారిని పోయే కంపను తగిలించుకొని చివరికి బాధపడటం కొందరికి ఒక అలవాటుగా ఉంటుంది.

ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో( Social media ) తరచుగా వైరల్ అవుతుంటాయి.

తాజాగా ఆ కోవకు చెందిన మరొక వీడియో ట్విట్టర్‌లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో ( Viral video )ఒక వ్యక్తి బోనులో ఉన్న సింహాన్ని గెలకడం మనం చూడవచ్చు.ఆ బోను రంధ్రాలతో ఒక పంజరం లాగా ఉంది.దానికి మనిషి వేలు పట్టేంత చిల్లులు ఉన్నాయి.

ఆ చిల్లుల ద్వారా వేలు పెట్టి సింహంతో సదరు వ్యక్తి ఆడుకోవడం కనిపించింది.దాని బుగ్గ మీద కొడుతూ దాని నోట్లో నుంచి వేలు పెట్టి అది కొరకక ముందే బయటికి తీయడం అతను చేశాడు.

Advertisement

అతడి చేష్టలకు సింహం విసిగిపోయింది.సమయం చూసి అతడి వేలను తన నోటితో పట్టుకోగలిగింది.

దాంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా గుండె పగిలాడు.

తన వేళ్లను సింహ నోటిలో నుంచి బయటికి లాక్కోడానికి చాలా ప్రయత్నించాడు.కానీ సింహం( Lion ) అస్సలు వదిలిపెట్టలేదు.బలంగా తన వేళ్లను లాక్కోడానికి అతడు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.

చివరికి అతడి వేళ్ళు సింహం నోటిలోనే చిక్కుకుపోగా అతడు లాక్కునే ప్రయత్నంలో తన ఫింగర్స్ పోగొట్టుకున్నాడు.ఈ దృశ్యాలను పక్కనే ఉండి చూస్తున్న మిగతా సందర్శకులు వీడియో తీశారు.27 సెకండ్ల నిడివున్న ఈ వీడియో ఒక హారర్ పిక్చర్ ను తలపించింది.ఈ వీడియో చూసి చాలామంది షాక్ అవుతున్నారు.

నార్త్ ఈస్ట్ ఇండియన్‌ని దారుణంగా గేలి చేసిన పిల్లలు.. కలకలం రేపుతోన్న వైరల్ వీడియో..
మరో అనారోగ్య సమస్యకు గురైన సమంత... ఎమోషనల్ పోస్ట్ వైరల్!

మరికొందరు తగిన శాస్తి జరిగింది అని తిట్లు తిడుతున్నారు.సింహాలతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది మరి అని ఇంకొందరు అన్నారు.

Advertisement

మొత్తం మీద సింహం ఈ వ్యక్తి జీవితంలో మర్చిపోలేని గుణపాఠం నేర్పించింది అని మరికొందరు అన్నారు.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

తాజా వార్తలు