వైరల్ వీడియో: రెప్పపాటులో ప్రాణాలు దక్కించుకున్న వ్యక్తి..!

ఈ మధ్య కాలంలో రైల్వే ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి.రైల్వే స్టేషన్లలో అనేక రకాలుగా హెచ్చరిక బోర్డులు దర్శనమిస్తుంటాయి.

 Viral Video The Man Who Survived In The Blink Of An Eye Shocking Video, Viral, M-TeluguStop.com

ప్రయాణికుల సంక్షేమం కోసం సిబ్బంది అనుక్షణం అలర్ట్ గా ఉంటారు.చాలా మంది సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ప్రాణాలను కోల్పోతున్నారు.

కొందరైతే ఆత్మహత్యాయత్నం చేస్తున్నారు.సమయానికి రైలు ఎక్కాలంటే టైం సరిపోక పోవడం వల్ల హడావుడిగా వచ్చి ప్రమాదాల బారిన పడుతున్నారు.

కదులుతున్న రైలెక్కడం, పట్టాలు దాటడంలాంటివి చేస్తుండటం వల్ల వారు తమ ప్రాణాలను కోల్పోతున్నారు.అయితే ఇలాంటి ఘటనల వల్ల కొంత మందే తమ ప్రాణాలను దక్కించుకుంటున్నారు.

తాజాగా ఇలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఒక వ్యక్తి కదిలే రైలు ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాడు.కానీ, అకస్మాత్తుగా అతను జారిపడి నేల మీద పడిపోయాడు.అయితే, రైల్వే సిబ్బంది అతన్ని సకాలంలో రక్షించారు.

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది.

ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వద్ద రైల్వే స్టేషన్ లో ప్రయాణికుడు కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించి తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు.ఆ ప్రయాణికుడికి భూమి మీద ఇంకా బతికే నూకలు రాసిపెట్టి ఉన్నట్లుంది.కొంత టైంలోనే కదులుతున్న ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించి ఆ తర్వాత ప్రాణాలను నిలుపుకున్నాడు.ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వద్ద ముంబై – మంగళూరు ప్రత్యేక రైలును పట్టుకోవడానికి ఒక వ్యక్తి అకస్మాత్తుగా పరిగెత్తడంతో అక్కడున్న సిబ్బంది అలర్ట్ అయ్యారు.

ఆ వ్యక్తి రైలు ఎక్కుతున్న సమయంలో ఆ రైలు ముందుకు కదిలింది.ఆ సమయంలోనే ఆయన కదిలే రైలు ఎక్కడానికి చూశాడు.అయితే ఆ తర్వాత రైలు దాని స్పీడ్ ను పెంచేసింది.దీని కారణంగా అతడు జారిపడి పడిపోయాడు.

ఇది మాత్రమే కాదు నెమ్మదిగా కదులుతున్న రైలు కిందికి పోవడం మొదలు పెట్టాడు.ఇది చూసిన ఇద్దరు రైల్వే ఉద్యోగులు అక్కడకు వెళ్లి అతనిని రక్షించారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube