వైరల్ వీడియో: విదేశీయులను డబ్బులు డిమాండ్ చేసిన భిక్షాటన చిన్నారులు..

సాధారణంగా భారత పర్యటనకు చాలామంది విదేశీయులు ప్రయతించడం చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.

ఆలా వచ్చిన వారు దేశంలోని అనేక ప్రాంతాలను సందర్శించి అక్కడి పరిస్థుతలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారు.

ఇలా మన దేశంలోని చాలా మంది విదేశాలలో కూడా ఫేమస్ అయ్యారు.అంత ఎందుకు కుమారి ఆంటీ, ఢిల్లీ వాడాపావ్ అమ్మాయి, డాలి ఛాయ్ ఇలా చాలా బాగా ఫేమస్ అయ్యారు.

ఇకపోతే తాజాగా కొందరు విదేశీయులు భారత పర్యటనకు వచ్చినప్పుడు కొన్నిసార్లు విదేశీయులకు అనుకొని పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి.అచ్చం అలాంటి పరిస్థితి తాజాగా కొంత మంది విదేశీయులకు ఢిల్లీ( Delhi ) నగరంలో ఎదురయ్యింది.

పర్యటనకు వచ్చిన కొందరు విదేశీయులు ప్రయాణిస్తున్న ఆటోను ఇద్దరు ముగ్గురు చిన్నారులు వెంబడించి డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.

Advertisement

ఇందుకు సంబంధించి పూర్తి వివరాలకు వెళ్తే.ఢిల్లీ నగరంలో పర్యటన కోసం వచ్చిన విదేశీయులు ఆటోలో వెళుతుండగా, రోజు వారి భిక్షాటన చేసుకునే ఇద్దరు అమ్మాయిలు ఆ విదేశీయులను డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఒక అమ్మాయి వాహనం వెనుక పరిగెత్తుతుండగా, మరో అమ్మాయి ఆటోను పట్టుకొని ప్రమాదకరంగా వేలాడింది.

ఇలా ఆ అమ్మాయిల ప్రవర్తన చూసి ఒక్కసారిగా పర్యటకులు ఆందోళనకు లోనయ్యారు.ఇక ఇందుకు సంబంధించిన వీడియోను ఆ విదేశీయుడు రికార్డు చేస్తూ "ఇది చాలా దారుణం.

ఏం జరుగుతుందో నమ్మలేకపోతున్నా." అంటూ మాట్లాడాడు.

ఇక మరోవైపు ఢిల్లీలో ఇలాంటి పరిస్థితి మామూలే అని ఆటో డ్రైవర్( Auto driver ) అలానే ముందుకు కొనసాగాడు.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
కుంభమేళాలో ఘోరం.. ప్రశ్నించినందుకు యూట్యూబర్‌ని చితక్కొట్టిన సాధువు.. వీడియో లీక్!

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.అయితే ఢిల్లీకి వచ్చే విదేశీ ప్రయాణికులు చాలా మంది ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.ఇక కొన్ని లేక ప్రకారం ఢిల్లీలో 70 వేలకు దెగ్గర దెగ్గరగా పిల్లలు రోడ్డుపై జీవిస్తున్నారని సమాచారం.

Advertisement

అందులో చాలామంది బిక్షాటన చేయడం నిజంగా ద్రువదృష్టకరమనే చెప్పాలి.

తాజా వార్తలు