వైరల్ వీడియో: అచ్చం మనిషిలా ఆ కోతి చేసిన పనికి నెటిజన్స్ ఫిదా..!

కోతుల నుంచే మనిషి రూపాంతరం చెందాడని మనం చాలా పుస్తకాల్లో చదివాం.సైన్స్ కూడా అదే చెబుతోంది.

కోతులకు, మనుషులకు దగ్గరి లక్షణాలు ఉన్నాయి.కోతుల శరీర అవయవ నిర్మాణం మనుషుల శరీర నిర్మాణానికి దగ్గరగా ఉంటుంది.

అందుకే ప్రయోగశాలల్లో వ్యాధి సంబంధిత పరీక్షలను మొదటగా కోతులపై చేస్తుంటారు.కోతులపై పరీక్షలు సక్సెస్ అయితే తరువాత మనుషులపై ప్రయోగిస్తారు.

కోతులను సర్కస్ లో, సినిమాల్లో కూడా ఉపయోగిస్తారు.ట్రైనింగ్ ఇస్తే కోతులు మనుషులు చేసే పనులు కూడా చేస్తాయి.

Advertisement

మనం దేశంలో ఏ పుణ్యక్షేత్రంలో చూసినా కోతులు ఎక్కువగా కనిపిస్తుంటాయి.ఇక ప్రస్తుతం అడువుల శాతం తగ్గిపోవడంతో కోతులు ఊళ్లలోకి వచ్చి ఇళ్లల్లో ఉండే ఆహారాన్ని ఎత్తుకెళ్తున్నాయి.

ఇళ్లల్లోకి దూరి ఏవి దొరికితే వాటినే పట్టుకెళ్తాయి.కానీ ఈ వీడియోలో ఉన్నకోతి విచిత్రంగా బట్టలు ఉతుకుతోంది.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోలో కోతి ఒక వస్త్రాన్ని బ్రష్ ను ఉపయోగిస్తూ ఉతుకుతుంది.

అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.దీంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

సెన్సార్ పూర్తి చేసుకున్న నాని హిట్3 మూవీ.. ఆ సీన్లను కట్ చేశారా?
పరీక్షకు నిమిషాల ముందు షాక్.. హాల్ టికెట్ తన్నుకుపోయిన గద్ద.. చివరి క్షణంలో ఏమైందంటే..?

ఈ వీడియోకు రకరకాలుగా కామెంట్స్ వస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు