వైసీపీ నేతలు ఎదుటివారిపై పంచ్ లు వేయడంలోనే కాకుండా ఎంటర్టైన్మెంట్ చేయడంలో కూడా ముందే ఉంటారు.ఇప్పటిదాకా అధికార పార్టీలో ఉన్న రోజా మాత్రమే మంచి డ్యాన్సర్ అనుకుంటే ఆమె తరువాత మరొక డ్యాన్సర్ కూడా ఉన్నారని నిరూపించారు మరొక వైసీపీ ఎమ్మెల్యే.
తాజాగా విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇంకో విశేషం ఏంటంటే ఆయన సింగిల్ గా డ్యాన్స్ వేయలేదు కదా.ఆయన భార్యతో కలిసి అదిరే స్టెప్పులు వేసి అందరిని ఆశ్చర్యంలో ముంచేశారు.
ఎప్పుడు మీటింగ్ లు, సభలు, పార్టీలు అంటూ ఆయనకు కూడా బోర్ కొట్టినట్లు అనిపించేదేమో.
ఒక్కసారిగా ఆయనలో ఉన్న టాలెంట్ అంతటిని బయట పెట్టి అందరికి షాక్ ఇచ్చారు.నన్ను రాజకీయ నాయకుడిలాగానే ఇన్నాళ్లు చూసారు.నాలో మంచి డ్యాన్సర్ కూడా ఉన్నాడు అని మరొక యాంగిల్ కూడా చూపించారు.ఇంతకు ఆయన ఎవరు అని అనుకుంటున్నారా.
ఆయన మరెవరో కాదు.విశాఖపట్నం జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్.
నిత్యం పార్టీ మీటింగ్ లతో బిజీగా ఉండే ఆయన తాజాగా జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొని అదిరిపోయే స్టెప్పులు వేశారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘కొండవీటి దొంగ‘ సినిమాలోని ‘శుభలేఖ రాసుకున్నా ఎదలోఎపుడో’ అనే పాటకు ఆయన సతీమణితో కలిసి వేసిన డ్యాన్స్ కు అందరూ విజిల్స్ వేసి మరి ఎంకరేజ్ చేసారు.
అక్కడితో ఆగకుండా తాజాగా వచ్చిన పుష్ప సినిమాలో రారా సామీ.నా సామి అనే పాటకు కూడా అదిరిపోయే స్టెప్స్ వేసి అదరహో అని అనిపించారు.
ఇలా ఆయన ఉన్నంత సేపు అక్కడ ఒక పండగ వాతావరణం నెలకొంది.ఎమ్మెల్యేలో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యపోయారు.
ఎమ్మెల్యే సార్.మీరు సూపర్ సార్ అంటూ పొగడ్తలతో ముంచేశారు.
గుడివాడ అమర్ నాథ్ అభిమానులు, అనుచరులు అయితే అన్న ఏం చేసినా సూపరే అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.