వైరల్ వీడియో: ఉగాండాలో తమన్నా సాంగ్‌ను రీక్రియేట్ చేసిన చిన్నారులు

సినిమాలకు భాష, ప్రాంతం అనే తేడా ఉండదు.సినిమా బాగుంటే ఏ భాష వాళ్లైనా చూస్తారు.

 Viral Video Kids Recreate Tamannaah Song In Uganda, Girls', Dance, Kids, Thamnaa-TeluguStop.com

హాలీవుడ్ సినిమాలు( Hollywood movies ) ప్రపంచవ్యాప్తంగా చాలా భాషల్లో విడుదల అవుతూ ఉంటారు.ఆ సినిమాను అందరూ చూస్తూ ఉంటారు.

ఇక ఇండియన్ సినిమాలను విదేశీయులు కూడా చూస్తూ ఉంటారు.అలాగే కొరియన్, ఇతర భాషల సినిమాలను కూడా ఇండియన్స్ చూస్తూ ఉంటారు.

అందుకే సినిమాలకు భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఉంటారు.

అయితే ఇటీవల రజనీకాంత్ హీరోగా వచ్చిన జైలర్ సినిమా( Jailer movie ) అన్ని భాషల్లోనూ విజయం సాధించింది.చాలా కాలం తర్వాత రజనీకాంత్ హిట్‌ను అందుకున్నారు.ఈ సినిమాలోని కావాలయ్యా సాంగ్ బాగా పాపులర్ అయింది.

అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా.తమన్నా వేసిన డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది.

ఈ పాటలో తమన్నా తన గ్లామర్ తో పాటు డ్యాన్స్ తో అందరినీ ఉర్రూతలూగించింది.ఈ పాటనే సినిమా ప్రమోషన్స్ కు ఎక్కువగా జైలర్ యూనిట్ ఉపయోగించుకుంది.

యూట్యూబ్ లో ఏకంగా 100 మిలియన్ల వ్యూస్( 100 million views ) ని క్రాస్ చేసి సరికొత్త రికార్డ్ సృష్టించింది ఈ పాట.తాజాగా దేశం దాటి ఉగాండా వరకు చేరుకుంది.ఉగాండాలో ఈ పాటకు చిన్నారులందరూ కలిసి డ్యాన్స్ వేశారు.బార్సిలోనాకి సంబంధించిన జెర్సీని వేసుకుని ఓ బిల్డింగ్ ముందు కావాలయ్యా పాటలోని హుక్ స్టెప్స్ ని రీక్రియేట్ చేశారు.

ఈ పాట పాడిన శిల్పారావు దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.మీ డ్యాన్స్ సూపర్ డూపర్ గా ఉందని, చాలా అద్భుతమంటూ ఆయన పేర్కొన్నారు.

ఈ పాటపై ప్రేక్షకులు చూపించిన క్రేజ్ కు ధన్యవాదాలు అంటూ పేర్కొన్నారు.ఈ పాటతో తమన్నా రేంజ్ విదేశాలకు కూడా చేరుకుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube