హఠాత్పరిణామం: ఆ కారణంగా గుర్రంపై పారిపోయిన పెళ్ళికొడుకు.. వెంటపడ్డ బావమరిది!

సోషల్ పరిధి రోజురోజుకీ విస్తరించడంతో ప్రపంచం నలుమూలలా జరిగే వింతలూ విశేషాలు మనకు ఇట్టే తెలిసిపోతున్నాయి.ఈ క్రమంలో పెళ్లిళ్ల వీడియోలు కూడా నెట్టింట హల్ చల్ చేయడం మనం చూస్తున్నాం.

 Viral Video Horse Take Away Groom After Bursting Crackers Details, Horse, Viral Latest, Viral News, Social Media, Viral Video, Bride, Groom , Horse Take Away Groom ,bursting Crackers, Crackers Sound, Groom Horse, Funny Wedding Video-TeluguStop.com

పెళ్లి వేడుకలో జరిగే సరదా సన్నివేశాలు, బాధాకరమైన ఘట్టాలు నిత్యం వార్తలలో నిలుస్తున్నాయి.ప్రస్తుతం పెళ్లంటే చాలా క్రేజీగా మారింది.

ఈ క్రమంలో పెళ్లి వేదికకు కొత్త జంట వెరైటీగా ఎంట్రీ ఇస్తున్నారు.వధూవరులు బుల్లెట్ బండీ, ఎడ్లబండి, క్రేన్ లాంటి వెరైటీగా వాహనాలతో కళ్యాణమండపంలోకి ఎంట్రీ ఇస్తున్నారు.

 Viral Video Horse Take Away Groom After Bursting Crackers Details, Horse, Viral Latest, Viral News, Social Media, Viral Video, Bride, Groom , Horse Take Away Groom ,bursting Crackers, Crackers Sound, Groom Horse, Funny Wedding Video-హఠాత్పరిణామం: ఆ కారణంగా గుర్రంపై పారిపోయిన పెళ్ళికొడుకు.. వెంటపడ్డ బావమరిది-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో కొన్ని పెళ్లిలో ఫన్నీ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

ఈ క్రమంలో ఓ వీడియో ఒకటి నెట్టింట వెలుగు చూసింది.

దాన్ని చూసిన నెటిజన్లు పడిపడి నవ్వలేక ఛస్తున్నారు.వివరాల్లోకి వెళితే, పెళ్లివేడుకలో భాగంగా వరుడిని గుర్రం మీద బంధువులు, స్నేహితుల మధ్యలో ఊరేగింపుగా పెళ్లి మండపానికి తీసుకొని వచ్చారు.

వరుడిని గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పడానికి వధువు తరపు వారు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.పెళ్ళికొడుకు బావమరిది అందరిని సన్నద్ధం చేస్తున్నాడు.

స్నేహితులతో ఒకింత హడావుడి చేస్తున్నాడు.వరుడికి బొట్టుపెట్టి, మంగళ ఆరతులు ఇచ్చారు.

ఈ క్రమంలో.కొంత మంది అక్కడ టపాసులు కాల్చారు.అంతే! అప్పుడు ఊహించని మలుపు చోటుచేసుకుంది.

టపాసుల శబ్ధానికి గుర్రం బెదిరిపోయి, అక్కడి నుంచి పరుగులంకించింది.పాపం దాంతో పాటు వరుడు కూడా అక్కడ మాయమయ్యాడు.దీంతో అందరూ షాక్ కు గురయ్యారు.

గుర్రాన్ని పట్టుకునేందుకు దాని యజమాని, పిల్లకొడుకు కోసం బావమరిది అక్కడినుండి పరుగు తీశారు.అయితే వారు దొరికారో లేదో తెలియదు కానీ, ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి ఫన్నీ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది.

సదరు వీడియోని తిలకించిన నెటిజన్లు కామెంట్ల రూపంలో కూసింత కామెడీ చేస్తున్నారు.వీలైతే ఒక్కసారి చూడండి జరా!

.