వైరల్... మొసలితోనే మజాకా... ఆటపట్టించిన వ్యక్తిని ఏం చేసిందంటే?

మనం ఏదైనా జంతువు దగ్గరకి భయం లేకుండా ఎప్పుడు వెళ్తాం దాని ద్వారా మనకు ఎటువంటి ప్రాణ హాణి ఉండదు అనే నమ్మకం మనకు వచ్చిన తరువాత.

అంతేకాక ఆ జంతువుతో ఎటువంటి రిస్క్ లేదని ముందు మనకు తెలుస్తుంది కాబట్టి ఆ జంతువుకు కొద్దిగా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం.

కానీ అది భయంకరమైనదని తెలిసి అంతేకాక మనంతట మనం తట్టిలేపి దానిని ఆగ్రహానికి గురయ్యేలా ప్రవర్తించడం చాలా రిస్క్ తో కూడిన వ్యవహారం.అలా వందలో తొంభై తొమ్మిది శాతం మంది ఇలా చేయరు ఎవరో ఒకరు అలా చాలా వింతగా ప్రవర్తిస్తుంటారు.

ఇక అసలు విషయంలోకి వస్తే మామూలుగా మొసళ్ళలో చాలా రకాల మొసళ్ళు ఉంటాయి.అందులో సముద్రపు అలెగ్జాండర్ మొసలి చాలా ప్రమాదకరం.

దాని నోటికి చిక్కినదంటే ఇక ఆశలు వదిలేసుకోవాల్సిందే.

Advertisement

దాని దవడలు అత్యంత బలంగా ఉంటాయి.అయితే ఇంతటి భయంకరమైన మొసలి ఉందంటే మనం ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్ళే ప్రయత్నం చేయము కదా.కానీ మామూలుగా ఒడ్డుకు సేద తీరుతున్న మొసలి దగ్గరకు వెళ్ళి దానిని లేపే ప్రయత్నం చేస్తాడు.అయితే మొసలితో గేమ్స్ ఆడే ప్రయత్నం చేయవద్దు కదా ఒకవేళ చేస్తే అదును చూసి దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తుంది.

ఇక ప్రాణాలతో బయట పడటం అసంభవం.అయితే మొసలిని తట్టి లేపే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా అతని చేయిని మొసలి పట్టుకుంది.ఇక కొద్ది సేపు మొసలి నోట్లో నుండి చేయి విడిపించుకోవడానికి ప్రయత్నం చేసి కొద్ది సేపటి వరకు ఎలాగొలా చేయి విడిపించుకున్నాడు.

ఈ వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి.ఇక ఆ వ్యక్తిని నెటిజన్లు పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోస్తున్నారు.

ఈ వీడియోను మీకూ చూడాలని ఆసక్తిగా ఉంది కదా.ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మరి.

వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..
Advertisement

తాజా వార్తలు