సోషల్ మీడియా అనేది రకరకాల వీడియోలకు నిలయంగా మారిపోయింది.అందులో కొన్ని వీడియోలు నెట్టింట జనాలకి విపరీతంగా నచ్చేస్తుంటాయి.
అలా నచ్చిన వీడియోలకు మంచి గిరాకీ ఉంటుంది.దాంతో సదరు వీడియోలలో వున్నవారు ఓవర్ నైట్ సెలిబ్రిటీలు అయిపోతూ వున్నారు.
ఇంకేముంది కట్ చేస్తే వారిచుట్టూ కొన్ని రోజులు ఈ మీడియాలు తిరుగుతూ ఉంటాయి.తాజాగా ఓ వీడియో కంటెంట్ కూడా జనాలకి విపరీతంగా నచ్చేస్తోంది.
అయితే ఆ వీడియోలో వున్నది మనిషి కాదు సుమా.అవును, ఓ కోతికి సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.సాధారణంగా ఎవరి పిల్లలైనా తమ చిన్నతనంలో తల్లి దండ్రులను విడిచిపెట్టి ఒక్క క్షణమైనా ఉండలేరు.అలాగే సదరు తల్లి దండ్రులకు కూడా వారి పిల్లలే వారికి ప్రపంచం.
తాము ఎక్కడ వున్నా… తిన్నా, తినకున్నా పిల్లలకు మాత్రం 3 పూటలా అన్నం పెడతారు.ఈ క్రమంలో పిల్లలకు చిన్న దెబ్బ తగిలినా అల్లాడి పోతారు.ఇక ఏదో ఒక సందర్భంలో ఒకరిని ఒకరు విడిచి పెట్టి ఉండాల్సిన సమయం వచ్చినపుడు వారు ఇరువురూ తట్టుకోలేరు.అయితే ఈ అనుబంధం అనేది కేవలం మానవులకే పరిమితమా? కాదు కాదు… జంతువులకు కూడా వర్తిస్తుందని ఇక్కడి వీడియో చెప్పకనే చెబుతోంది.

అవును, వైరల్ అవుతున్న వీడియోని చూస్తే… ఓ బేబీ కోతి ఒక యువతిని హత్తుకొని ఉంటుంది.అదే సమయంలో అక్కడే ఉన్న ఓ స్త్రీ ఆ బేబీ కోతిని తన చేతులోకి తీసుకొనే ప్రయత్నం చేస్తుంది.దాంతో వెంటనే ఆ బేబీ కోతి ఏడవడం మనం ఇక్కడ చూడవచ్చు.దాంతో చేసేదేం లేక ఆ యువతి తన ఆ కోతిని మరలా ఇచ్చేస్తుంది.మరలా యువతి వద్దకు రాగానే బేబీ కోతి నిశ్శబ్దం అయిపోతుంది.అంతేకాకుండా బేబీ కోతి ముఖంలో తెలియని అనుబంధం చూడవచ్చు.
ఈ వైరల్ వీడియోని Mohit Vijh అనే ట్విట్టర్ ఖాతాలో అప్‌లోడ్ చేయగా అదికాస్త వైరల్ అవుతోంది.ఈ వీడియోకు నెటిజన్లు లైకుల, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.







