జిమ్‌లో వర్కవుట్ చేస్తూ కూలిపోయిన వ్యక్తి... డాక్టర్స్ ఏం చెబుతున్నారంటే?

నేటి దైనందిత జీవితంలో ప్రతి రోజూ వ్యాయామం చేయమని డాక్టర్లే సూచనలు చేస్తూ వుంటారు.ఎందుకంటే ఈ స్మార్ట్ యుగంలో మనిషి శరీరం కదల్చకుండానే పనులు చేస్తూ వున్నాడు.

 Indore Hotel Man Dies Of Heart Attack While Doing Gym,gym,workouts,indore,social-TeluguStop.com

అందుకనే రకరకాల రోగాల బారిన పడుతున్నాడు.అలాంటి సమస్యలను అధిగమించడానికి వ్యాయామం అనేది చాలా అవసరం.

అయితే అదే వ్యాయామం మనిషికి శాపంలాగా నేడు మారుతోంది.అయితే తప్పు వ్యాయామంలో వుంది అనుకుంటే పొరపాటే.

ఇక్కడ కొన్ని విషయాలు గ్రహించాలి.మోతాదుకు మించి వర్కవుట్స్ చేసినా లేదా వయసు ఎక్కువగా ఉన్నవాళ్లు, గుండె జబ్బు వంటి ఇతర సమస్యలతో బాధపడే వాళ్లు జిమ్‌లో ఎక్కువగా ఉండటం మంచిది కాదు.

తాజాగా జరిగిన మరో సంఘటనని చూస్తే ఆ విషయమే మనకి బోధపడుతుంది.మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో ఓ యాభై ఏళ్లకు పైబడిన వ్యక్తి జిమ్‌లో ఎక్సర్‌సైజ్‌ చేస్తుండగా కుప్పకూలిపోయాడు.

అందరూ చూస్తుండగానే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం.ఇక్కడ చాలామంది ఆరోగ్యమే మహాభాగ్యం అనుకొని దాన్ని కాపాడుకునేందుకు ఎక్సర్‌సైజులు, జిమ్‌లో వర్కవుట్స్ చేసి శరీరాన్ని ధృడ పరుచుకుంటున్నారు.

అయితే ఇది మంచి పరిణామం కాని… వయసు పైబడుతున్న కొద్ది వ్యాయమం కొంత రిలాక్స్‌గా చేయడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.

ఆ బాధితుడి పేరు ప్రదీప్‌ రఘువంశీ.అతడు 53ఏళ్ల హోటల్‌ వ్యాపారి.విజయ్‌నగర్‌లోని గోల్డ్ జిమ్‌కు రెగ్యులర్‌గా వెళ్లడం ఆయన దినచర్య.

రోజులాగే గురువారం రోజున కూడా యధావిదిగా జిమ్‌కి వచ్చి ఉదయం 7గంటల సమయంలో ట్రెడ్‌మిల్‌పై జాగింగ్ చేశాడు.ఈ క్రమంలోనే తాను వేసుకున్న జాకెట్ తీసేందుకు పక్కకు వస్తూనే కుప్పకూలిపోయాడు.

అయితే మొదట హోటల్ వ్యాపారి కళ్లు తిరిగి పడిపోయాడని జిమ్‌లోని వ్యక్తులు అనుకున్నారు.దాంతో వెంటనే నిర్వహకులు గమనించి వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా మార్గం మధ్యలోనే చనిపోయాడట.

కాగా ఈ విషయమై సదరు డాక్టర్స్ వ్యాయామం విషయమై స్థానికంగా వున్న జిమ్స్ దగ్గరకు వెళ్లి ఆవాహన కల్పిస్తున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube