ప్రపంచ సోషల్ మీడియా దిగ్గజాలలో మొదటి వరుసలో ఉన్నటువంటి ‘ఇన్‌స్టాగ్రామ్’ గురించి ప్రత్యేకించి ప్రస్తావన అవసరం లేదు.సామాన్యులనుండి సెలబ్రిటీల వరకు అందరూ మెచ్చేది ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫారమ్ నే.
రోజురోజుకీ వినియోగదారులను పెంచుకుంటున్న ఈ సోషల్ మీడియా దిగ్గజం ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్స్ తెస్తూ, మరింతమందిని అట్రాక్ట్ చేసే దిశగా అడుగులు వేస్తోంది.ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది.
అదే.Alt text ఫీచర్.ఇన్‌స్టా పోస్టుల్లోని కంటెంట్‌ను వివరించేందుకు ఈ ఫీచర్ అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు.దాంతో మీరు సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ పోస్టుల కోసం టెక్స్ట్‌లను చాలా తేలికగా రూపొందించవచ్చు.
అయితే ఇపుడు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఆల్ట్ టెక్స్ట్‌ను ఎలా యాడ్ చేయాలి? ఎలా మార్చాలి? అనే అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.దానికి ముందుగా మీరు మీ మొబైల్ ఫోన్‌లో వున్న Instagram యాప్‌ని ఓపెన్ చేయాలి.
తరువాత అప్పటికే ఉన్న ఫొటో ఒకదానిని అప్‌లోడ్ చేయండి.ఇప్పుడు ఇమేజ్-ఎడిటింగ్ టూల్, ఫిల్టర్‌ని ఎంచుకొని Next బటన్‌పై Tap చేసి యాక్సెసిబిలిటీ Tabకు వెళ్లండి.
ఆ తరువాత బాక్స్‌లో Alt Text ఎంటర్ చేసినతరువాత పోస్ట్ చేయడానికి Share బటన్ పై Tap చేస్తే సరిపోతుంది.
ఇక ఇపుడు పోస్ట్ Alt Text ఎలా మార్చాలో తెలుసుకుందాం.తొలుత మీ స్మార్ట్‌ఫోన్‌లో Instagram యాప్‌ను ఓపెన్ చేసి ఆల్ట్ టెక్స్ట్ మార్చాల్సిన Instagram పోస్ట్‌ను విజిట్ చేయండి.తరువాత ఫోటో లేదా వీడియో పక్కన అందుబాటులో ఉన్న 3 డాట్స్ మెను బటన్‌పై Tap చేయండి.
Edit ఆప్షన్ ఎంచుకొని యాక్సెసిబిలిటీ ట్యాబ్‌కి వెళ్లండి.ఆ తరువాత పోస్టు కింద ఫొటో అప్‌లోడ్ చేయగానే కనిపించే అదనపు బాక్సులో మీకు నచ్చిన టెక్స్ట్ ఎంటర్ చేసిన తరువాత చేసిన మార్పులను Save చేసేందుకు Done బటన్‌ను Tap చేస్తే సరిపోతుంది.