వైరల్ వీడియో: చిన్నారిని ఎత్తుకెళ్లడానికి వచ్చిన కిడ్నాపర్.. కానీ..?!

ప్రపంచంలో ఎక్కడ చూసినా బాలికలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.బాలికలను కిడ్నాప్ చేయడం, బాలికలు హత్యలకు గురైన ఘటనలు ఎన్నో మనం చూస్తున్నాం.

ప్రభుత్వాలు ఎంత కఠిన చట్టాలు తీసుకొచ్చినా, కఠిన శిక్షలు అమలు చేసినా.దారుణాలు జరగడం మాత్రం ఆగడం లేదు.

బయటికి లేదా స్కూలుకు వెళ్ళినప్పుడు పిల్లలు ఇతరులతో ఎలా ఉండాలి, గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మాట్లాడితే ఏం చేయాలి, ఎవరైనా కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తే వారిని ఎలా ఎదుర్కోవాలో తల్లిదండ్రులు, పెద్దలు వారికి అవగాహన కల్పించాలి.ఏదైనా సమస్య ఎదురైతే ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో చెప్పాలి.

వారిలో ధైర్యాన్ని నింపాలి.తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.

Advertisement

అందులో తనను కిడ్నాప్ చేయడానికి వచ్చిన వ్యక్తిని ఓ బాలిక ధైర్యంగా ఎదుర్కొని ప్రమాదం నుండి బయటపడింది.వీడియో ఆధారంగా అక్కడ ఏం జరిగిందంటే.

11 ఏళ్ల బాలిక స్కూల్ బస్ కోసం వేచి చూస్తోంది.ఆ సమయంలో అక్కడికి ఓ కారు వచ్చి ఆగింది.

కారులో నుంచి ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆ బాలిక వైపు పరిగెత్తుకుంటూ వచ్చాడు.అతడు దగ్గరికి రాగానే.

బాలిక అలర్ట్ అయ్యింది.ఆ దుండగుడు ఆ బాలికను కిడ్నాప్ చేయడానికి ట్రై చేశాడు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..

ఆమెను లాక్కెళ్లడానికి ప్రయత్నించాడు.ఆమెను ఎత్తుకుని పరిగెడుతుండగా కింద పడ్డాడు.

Advertisement

ఆ బాలిక ధైర్యంతో అతడితో పోరాడి తప్పించుకుంది.ఈ వీడియో చూసి అందరూ ఆ బాలికను అభినందిస్తున్నారు.

ఫ్లోరిడాలోని వెస్ట్ పెన్సకోలాలో ఉదయం 7 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది.ఆ వీడియో బయటకు రావడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

కిడ్నాపర్ ను ధైర్యంగా ఎదుర్కొన్న బాలికను ఎస్కాంబియా కౌంటీ షెరీఫ్ చిప్ సిమన్స్ అభినందించారు.

ఆ కిడ్నాపర్ ఒక్కసారిగా పరుగెత్తి వచ్చినందుకు ఆమె చాలా భయపడింది కానీ కాలుతో అతడిని తన్నడం, చేతులతో నెట్టివేయడం చేస్తూ ఎలాగోలా అతడి నుంచి తప్పించుకుంది.ఆ అమ్మాయి ధైర్యంగా అతడిని ఎదర్కోవడంతో ఆ కిడ్నాపర్ తన కారు వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు.ఈ కేసుకు సంబంధించి అక్కడి పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.

నిందితుడిని 30 ఏళ్ల జారెడ్ పాల్గా గా గుర్తించారు.ఈ ఘటన జరిగినప్పటి నుంచి ఆ బాలికతో ఆమె తల్లి బస్ స్టాప్‌ వరకు వచ్చి వెళ్తోంది.

తాజా వార్తలు