పిల్లలు ఆడుకోవడానికి బయటకి వెళ్ళినప్పుడు అక్కడ ఎంతోమంది మిత్రులు పరిచయం అవుతారు.వాళ్ళతో కొంచెం సేపు ఆడుకుని మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తారు.
అయితే ఒక బాలుడు మాత్రం ఆడుకునేందుకు బయటకు వెళ్ళాడు.కానీ, తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో తనతో పాటు మరొక ఫ్రెండ్ ను కూడా వెంట తీసుకుని వచ్చాడు.
తన కుమారుడు తీసుకొచ్చిన ఆ ఫ్రెండ్ ను చూసి వాళ్ళ అమ్మ ఆశ్చర్యంలో ఉండిపోయింది.వెంటనే తన మొబైల్ తీసుకుని ఆ ఇద్దరిని ఫోటోలు తీసింది.
అసలు ఆ ఫ్రెండ్ ను చూసి ఆమె ఎందుకు ఆశ్చర్యపోయింది అనుకుంటున్నారా ?! అసలు నిజం తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు.
ఆ బాబు వెంట తీసుకొచ్చిన ఫ్రెండ్ ఎవరనుకుంటున్నారు ? ఆ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కాదు.బాయ్ ఫ్రెండ్ కూడా కాదు.ఆ పిల్లాడి ఊహించని కొత్త ఫ్రెండ్ ఎవరంటే ఒక చిన్న జింక పిల్ల.అవును మీరు విన్నది నిజమే.ఆ చిన్నారి ఇంటికి తీసుకుని వచ్చింది ఒక జింక పిల్లని.
ఈ అరుదైన ఘటన అమెరికాలోని వర్జీనియాలో చోటు చేసుకుంది.వివరాలలోకి వెళితే ఒక కుటుంబం విహారయాత్ర కోసం వర్జీనియా లోని మసానుటెన్ కు వచ్చింది.అయితే వాళ్ళ 4 సంవత్సరాల బాబు అయిన డొమినిక్ ఈ నెల 26న ఆడుకునేందుకు బయటకు వెళ్లాడు.కొంత సమయం అయిన తర్వాత ఆ బాలుడు తిరిగి వచ్చి ఇంటి గుమ్మం దగ్గర తన మిత్రుడితో నుంచున్నాడు.
వాళ్ళిద్దరిని చూసి ఆ బాలుడు తల్లి స్టెఫానీ బ్రౌన్ ఆశ్చర్యపోయింది.ఆ బాలుడు చెంత ఒక చక్కని చూడ ముచ్చటి ఒక జింక పిల్ల నుంచిని ఉంది.
అయితే ఆ జింక పిల్ల మాత్రం ఎటువంటి భయం, బెరుకు లేకుండా డొమినిక్ పక్కన తలుపు వద్ద నిలబడి ఉండడం విశేషం.
తన కుమారుడి కొత్త ఫ్రెండ్ ను చూసిన ఆ తల్లి ముచ్చటపడి ఈ దృశ్యాన్ని వెంటనే తన మొబైల్ ఫోన్ లో బంధించింది.
ఆ ఫోటోను తల్లి స్టెఫానీ బ్రౌన్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.తన కొడుకు ఆ జింక పిల్లకు ఆహారం పెట్టేందుకు ఇంటికి తీసుకుని వచ్చాడని తెలిపింది.
అలాగే ఆ జింక పిల్ల తల్లి తన పిల్ల కోసం వెతుకుంటూ ఉంటుందని, ఆ జింక పిల్లను తిరిగి అదే పార్కులో వదిలేయమని తన కొడుకుకి చెప్పినట్లు తెలిపింది.ఈ ఫోటోను చూసి పలువురు నెటిజన్లు ముచ్చటపడుతున్నారు.
ఈ కొత్త ఫ్రెండ్స్ ని చూసి ఆనందిస్తున్నారు కూడా.