నెట్టింటి వైరల్: రెస్టారెంట్ యజమాని ఐడియా అదుర్స్.. అలా ఆర్డర్ చేస్తే సగం రేటే..!

ఓ రెస్టారెంట్ యజమాని ఐడియా తన వ్యాపారాన్ని మార్చి వేసింది.డబ్బులు ఉన్నాయని కొంతమంది రెస్టారెంట్ లలో సిబ్బందితో దురుసుగా ప్రవర్తిస్తారు.

అందుకు భిన్నంగా ఆలోచించిన యజమాని తన రెస్టారెంట్ కు వచ్చే వారంతా తన సిబ్బందితో మర్యాదగా ప్రవర్తించాలనే ఆలోచనలో పడ్డాడు.వెంటనే ఓ ఐడియాను ఆచరణలో పెట్టాడు.

యూకేలోని ప్రీస్టన్లో చాయ్ షాప్ అనే రెస్టారెంట్ ను ఈ ఏడాది మార్చి నెలలో ఉస్మాన్ హుస్సేన్ అనే వ్యక్తి ప్రారంభించాడు.దీనిలో టీ, డోనట్లు, స్ట్రీట్ ఫుడ్స్, డేసర్టులు దొరుకుతాయి.

కస్టమర్ల ప్రవర్తన ఆధారంగా బిల్లు ఉంటుందని అతను చెప్పాడు.ఇదే విషయాన్ని చెప్తూ ఫేస్బుక్ లో ఒక పోస్టు కూడా చేశాడు.

Advertisement

రెస్టారెంట్ బయట ఉండే బోర్డుపై కూడా ఇదే విషయాన్ని రాశాడు.ఇంతకీ అతను ఏం రాశాడో ఓ సారి చూస్తే.

రెస్టారెంట్ లో టీ తాగాలని అనుకునే వాళ్లు.దేశీ చాయ్’ అని అడిగితే 5 యూరోలు (రూ.400) చెల్లించాల్సి ఉంటుందట.అదే దేశీ చాయ్ ప్లీజ్ అనడిగితే కేవలం 3 యూరోలకే (రూ.240) ఇచ్చేస్తాడట.ఇంకాస్త హలో.దేశీ చాయ్ ప్లీజ్ అని ఆర్డర్ ఇస్తే టీ రేటు 1.9 యూరోలే(రూ.152) చార్జ్ చేస్తాడట ఉస్మాన్.అయితే ఇప్పటివరకు ఏ కస్టమర్ కూడా దురుసుగా ప్రవర్థించలేదని చెప్పాడు.

దీంతో ఇప్పుడు ఇది నెట్టింట వైరల్ కావడంతో అందరు అతని ఆలోచనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.రెస్టారెంట్ కు వచ్చే కస్టమర్లు సిబ్బందితో దురుసుగా ప్రవర్తరించకూడదని అలా చేసిన యజమానిని చూసి ఇతర యజమానులు కూడా ప్రవర్తనలో మార్పు వస్తుందని దాంతో రెస్టారెంట్ కు వచ్చే కస్టమర్లుకు, సిబ్బందికి మంచి సంబంధాలు ఏర్పడుతాయని ఇలా చెయ్యడంవల్ల అందరు అన్నీ చోట్ల మర్యాదగా ఉంటారని పబ్లిక్ అనుకుంటున్నారు.

ఈ ఒక్క సెట్టింగుతో స్పామ్ కాల్స్ నుండి ఉపశమనం పొందండి!
Advertisement

తాజా వార్తలు