హైదరాబాద్ ఉప్పల్ లో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు.ఈ హత్యల కేసుపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.
క్షుద్రపూజలే ప్రధాన కారణమని గుర్తించారు.మృతుడు నర్సింహ శర్మ పూజ చేయడంతో ఆరోగ్యం చెడిపోయిందని నిందితులు కక్ష గట్టారని తెలిపారు.
ఈ క్రమంలోనే దాడి చేసేందుకు వచ్చిన నిందితులు మొదటా నర్సింహ శర్మ హత్య చేశారు.అదే సమయంలో ఆయన కొడుకు హత్యకు అడ్డు రావడంతో కొడుకు శ్రీనివాస్ పై కత్తితో దాడికి పాల్పడ్డారు.
మొత్తం శ్రీనివాస్ ను 29 సార్లు కత్తితో కిరాతకంగా పొడిచి చంపారని పోలీసులు విచారణలో వెల్లడించారు.అదేవిధంగా ఘటనా స్థలంలో దొరికిన బ్యాగులో పసుపు, కుంకుమ లభ్యమైనట్లు తెలిపారు.
నిందితులు వినాయక్ రెడ్డి, బాలకృష్ణలుగా గుర్తించారు.వారి ఫోన్ లోకేషన్ ఆధారంగా నిందితులను విశాఖలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.







