రాజకీయ నాయకులు తాము ఇచ్చిన మాటలు, హామీలు నెరవేర్చకపోతే ప్రజలు ఆగ్రహజ్వాలలతో రగిలిపోతారు.నిరసనలు చేస్తూ తమ వ్యతిరేకతను చాటుకుంటారు.
కొందరు అయితే విభిన్నంగా నిరసన తెలిపి తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తారు.నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధు వృత్తిరీత్యా క్రికెటర్ మరియు పంజాబ్ రాష్ట్ర పర్యాటక, సాంసృతిక వ్యవహారాలు మరియు మ్యూజియంల మంత్రి.2004 సార్వత్రిక ఎన్నికలలో ఆయన బీజేపీ టికెట్‌పై అమృత్‌సర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.ఒక మారణకాండ కేసులో ఆరోపణలు రావడంతో 2006 లో ఆయన తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.2009 సాధారణ ఎన్నికలలో ఆయన కాంగ్రెస్‌కి చెందిన సురీందర్ సింగ్లాపై 77,626 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు.తాజాగా ఆయన కనిపించడం లేదంటూ పోస్టర్లు కలకలం రేపాయి.
సాధారణంగా తమ నియోజకవర్గ నాయకుడు కనిపించకపోతే ప్రజలు విసుగు చెంది తమ ప్రజా ప్రతినిధి కనిపించడం లేదంటూ ఫిర్యాదు కూడా చేస్తుంటారు.

కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు విషయంలోనూ ఇలాగే జరిగింది.నవజోత్ సింగ్ సిద్ధు 2017 అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లోని అమృతసర్ ఈస్ట్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.అయితే ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఒక్కసారి కూడా తన నియోజకవర్గంలో పర్యటించలేదు.
దీంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తమ ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ ఆ నియోజకవర్గం ప్రజలు ఊరూరా పోస్టర్లు అంటించారు.నవజోత్ సింగ్ సిద్ధు కనిపిస్తే ఆచూకీ తెలపాలని, రూ.50వేల రివార్డును అందజేస్తామన్నారు.అయితే 2019 జూలైలోనూ సరిగ్గా ఇలాంటి పోస్టర్లే సిద్ధు నియోజకవర్గంలో వెలిశాయి.అప్పట్లో రూ.2100 రివార్డును ఇస్తామని ప్రకటించారు.దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం సాధారణమైపోయింది.
నాయకులు పట్టించుకోనంత వరకూ ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి.ప్రజలు తిరగబడుతూనే ఉంటారు.