వైరల్: ఎవరెస్టు శిఖరంపై తొలిసారి కనిపించిన పల్లాస్‌ క్యాట్స్‌!

ఎవరెస్టు శిఖరం.అనగానే అందరికీ ఎత్తయిన శిఖరం గుర్తుకు వస్తుంది.

అందుకే ఎవరెస్టు శిఖరానికి సంబంధించిన ఏ విషయం అయినా అందరూ ఆసక్తిగా వింటారు.

తాజాగా ఈ శిఖరానికి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం బయటకు పొక్కింది.

అవును, ఇక్కడ అత్యంత అరుదైన రకం అడవి పిల్లి జాతిని జంతు శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది.పల్లాస్‌ క్యాట్స్‌గా పిలిచే ఈ అడవి పిల్లుల ఉనికి ఎవరెస్టు శిఖరంపై కనిపించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

సాధారణంగా ఊర్లలో కనిపించే పిల్లుల కంటే ఈ అడవి పిల్లులు కొంచెం పెద్దగా, బలంగా కనిపిస్తాయి.

Advertisement

పల్లాస్‌ క్యాట్స్‌ అడవి పిల్లులే అయినా ఇవి ఊర్లలో పిల్లుల కంటే కూడా చిన్నవిగా ఉండడం గమనార్హం.ఈ పల్లాస్‌ క్యాట్స్‌నే మనూల్‌లు అని కూడా అంటారు.ఈ పిల్లులను భూమిపైనే తొలిసారిగా 1776లో బైకాల్‌ సరస్సు పరిసరాల్లో "పీటర్‌ సైమన్‌ పల్లాస్‌" అనే జంతుశాస్త్రవేత్త కనుగొన్నాడు.

అందువల్లనే వీటిని పల్లాస్‌ క్యాట్స్ అని పిలుస్తారు.ఇవి పరిసరాలను బట్టి గ్రే, బూడిద, బూడిద ఎరుపు రంగుల్లో ఉంటాయి.తలకు ఇరువైపుల చెవులు పొట్టిగా గుండ్రంగా ఉంటాయి.

అలాగే వాటి పళ్ళు చాలా పొడవుగా ఉంటాయి.

ఇక తోక భాగం విషయానికొస్తే 20 నుంచి 30 సెంటీమీటర్ల పొడవుతో ఉంటుంది.కాళ్లు పొట్టిగా, శరీరంపై పొడవాటి వెంట్రుకలు వ్యాపించి ఉంటాయి.అలాగే వీపు భాగం విషయానికొస్తే ఉదర భాగంలో ఉండే వెంట్రుకలు కంటే ఇవి కాస్త చిన్నవిగా ఉంటాయి.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

చల్లటి ప్రదేశాల్లో నివసించే ఈ పిల్లులను చలి తీవ్రత నుంచి కాపాడేందుకు దానికున్న ఈ పొడవాటి వెంట్రుకలు కాపాడుతాయి.ఇవి ఎక్కువగా హిమాలయాలు, టిబెట్‌ పీఠభూమి, ఇరానియన్‌ పీఠభూమి, దక్షిణ సైబీరియన్‌ కొండలు తదితర ప్రాంతాల్లో కనిపిస్తాయి.

Advertisement

తాజా వార్తలు