పెళ్లిళ్లకు సంబందించిన వీడియోలు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ కావడం మనం చూస్తూనే ఉంటాం.
ఇక పెళ్లిళ్లకు వెళ్ళినవారు చాలామంది తమకు తోచిన వస్తువులను కొత్తగా పెళ్ళైన జంటలకు బహుమతులుగా ఇస్తుంటారు.
ఈ క్రమంలోనే ఇక్కడొక రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏకంగా కొత్తగా పెళ్ళైన జంటలు( Newly married couples ) ఖంగుతినేలా వారికి ఇచ్చే వెడ్డింగ్ కిట్‌లలో కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు పెట్టి పంపిణీ చేసింది.సదరు దృశ్యాలను చూడగానే వధూవరులిద్దరూ బిత్తరపోయారు.
ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో( Madhya Pradesh ) చోటు చేసుకోగా.స్థానికంగా వైరల్ కావడంతో పాటు ఇపుడు ఈ విషయం సోషల్ మీడియాకు ఎక్కింది.జాబువా జిల్లాలో ప్రభుత్వం నిర్వహించే సామూహిక వివాహాల్లో పాల్గొన్న జంటలకు ఇచ్చిన వెడ్డింగ్ కిట్‌లలో కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు ఉండటం పెళ్ళివారినే కాకుండా స్థానికులను సైతం ఆశ్చర్యానికి గురి ఎలా చేసింది.
దాంతో ఈ విషయం స్థానికంగా వివాదాస్పదమైంది.
జనాలు అలా అపార్ధాలు చేసుకుంటున్నారని తెలిసి ఏకంగా జిల్లా సీనియర్ అధికారి ఒకరు స్పందిస్తూ.అవి నిరుపయోగమైన వస్తువులు కావు.ఫ్యామిలీ ప్లానింగ్ గురించి జనాల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆ కిట్లలో వాటిని పెట్టి బహుమతిగా ఇచ్చిందని పేర్కొన్నారు.
కాగా, గతంలో కూడా వధువులకు ప్రెగ్నెన్సీ టెస్టులు( Pregnancy tests ) నిర్వహించడం.అక్కడ పెద్ద దుమారాన్ని రేపిన విషయం అందరికీ తెలిసిందే.ఆ సమయంలో కూడా వధువుల సాధారణ వయస్సు తెలుసుకునేందుకు, వారు ఆరోగ్యవంతులుగా ఉన్నారో లేదో తెలిసేందుకే ఈ టెస్టులు నిర్వహిస్తున్నామంటూ ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు కవర్ చేసుకొని చెప్పారు.
తాజాగా ఈ సంఘటనతో ప్రజలు అక్కడి ప్రభుత్వంపైన గుర్రుగా వున్నారని అర్ధం అవుతోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy