వైరల్ : ఈసారి KGF 2 ను వాడేసుకున్న హైదారబాద్ పోలీసులు..!

హైదారబాద్ పోలీసులు సందర్భాన్ని బట్టి మన సినిమాలను వాడేసుకుంటూ వుంటారు.తాజాగా ట్రాఫిక్ చాలానాల విషయంలో ఓ వినూత్న ఐడియాని అవలంబించారు.

ఈ క్రమంలో KGF 2 తాజా ట్రయిలర్ ని ఉపయోగించుకున్నారు.అవును.

"ఇంకా 3 రోజులే మిగిలి వున్నాయి.మీ వాహనాలపై ఉన్న ట్రాఫిక్ చాలానాలను మార్చ్ 31వ తారీఖులోపు చెల్లించండి.

ఈ అవకాశాన్ని నిర్లక్ష్యంతో చేజార్చుకోకండి.ప్రభుత్వం ఇచ్చిన రాయితీని మీరు చక్కగా సద్వినియోగం చేసుకోండి అంటూ ఓ నినాదాన్ని చేస్తున్నారు.

Advertisement

ఈ క్రమంలో కె.జి.యఫ్‌ ఛాప్టర్‌ 2 ట్రైలర్‌ లోని "ఆఫర్‌ క్లోజెస్‌ సూన్‌" డైలాగ్‌ మీమ్‌ ను వాడటం విశేషం.ఆలస్యం చేయకు మిత్రమా.

ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు అంటూ వారు విజ్ఞప్తి చేస్తున్నారు.ఇక ఇప్పటికీ కూడా వాహనాల చలాన్‌ లను క్లియర్ చేసుకోకుంటే.

వెంటనే ఆన్‌లైన్‌లో చెల్లించండి.లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది సుమా.! అంటూ ఓ హెచ్చరికను జరీ చేసారు.

సదరు విషయాన్ని గమనించిన నెటిజన్లు ఐడియా సూపర్ అంటూ సోషల్ మీడియాలో కమిటీలు పెడుతున్నారు.ఇక అసలు విసమయలోకి వెళితే.

మోయే మోయే మూమెంట్స్ ఫేస్ చేసిన టాప్-3 సినిమా సెలబ్రిటీస్
దారుణం: ఐసీ క్రీం ఇప్పిస్తామంటూ లైంగిక దాడి!

, తెలంగాణలో 50% చలానాలు క్లియర్‌ కాగా 50% పెండింగ్ చలాన్లలో టూ వీలర్స్ టాప్‌లో వున్నట్టుగా తెలుస్తోంది.ఓ స్కూటర్ ఓనర్‌ కు.అత్యధికంగా 178 చలాన్లు ఉండటం గమనార్హం.హెల్మెట్ లేకుండా ప్రయాణించినందుకు ఆయనకి ఈ చలాన్లు ఎక్కువగా పడ్డాయని తెలుస్తోంది.ఇక ఆగస్టు 2019 నుండి ఇప్ప‌టివ‌ర‌కు 178 చలాన్ల‌ మొత్తం రూ.48,595 గా ఉంది.రాయితీ పోను అతను చెల్లించాల్సి వచ్చేది కేవలం రూ.12,490గా వుంది.మరో స్కూటరిస్ట్ కి రూ.73,690 ల చలాన్లు ఉన్నాయని, అతను ప్ర‌త్యేక రాయితీని వాడుకొని 19, 515 చెల్లిస్తే సరిపోతుంది.మరి వీరు ఈ సదవకాశాన్ని వినియోగించుకుంటారో లేక ఫైన్ కట్టక తగిన మూల్యం చెల్లించుకుంటారో తెలియాల్సి వుంది.

Advertisement

తాజా వార్తలు