వైరల్‌: థ్రెడ్ మిల్‌పై వ్యాయామానికి బదులు నృత్యం చేస్తున్న గుజరాతీ స్త్రీలు!

భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో గార్భా అనే సాంప్రదాయ నృత్య కళ ఒకటి కలదు.

దీనిని ఆ ప్రాంత స్త్రీలు వివిధ పండుగలలో, పెళ్లిళ్లలో నర్తిస్తూ వుంటారు.

ఇక గర్భా అనేది ఓ సంస్కృత పదం.గార్భా అనే పదం "గర్భం" మరియు "చిన్న మట్టి దీపం" రెండింటి కలయిక, అంతే కేంద్రంగా వెలిగించిన దీపం లేదా శక్తి దేవత యొక్క చిత్రం లేదా విగ్రహం చుట్టూ అనేక సంప్రదాయ గార్బాలు వెలిగించడం అని అర్ధం వస్తుంది.ఇది అక్కడ సాంప్రదాయకంగా, ఇది 9 రోజుల హిందూ పండుగ నవరాత్రి సమయంలో ప్రదర్శించబడుతుంది.

ఈ గార్భా అనేది దేవత యొక్క చిత్రం (దుర్గా, అంబా) దగ్గర పూజించే వస్తువుగా కేంద్రీకృత వలయాల మధ్యలో ఉంచబడుతుంది.ఇంతకీ ఇపుడు ఈ తంతంతా దేనికంటారా? అదిగో అక్కడికే వస్తున్నా.మీరు థ్రెడ్ మిల్‌ పేరు వినే వుంటారు.

దానిపై బేసిగ్గా ఎవరన్నా ఫిట్‌నెస్, వ‌ర్కౌట్స్ చేస్తూ వుంటారు.ఎందుకంటే అవి దానికి సంబంధించిన పరికరాలు.

Advertisement

అయితే అక్కడి గుజరాతీ స్త్రీలు మాత్రం వ్యాయామాన్నే సరికొత్త రీతిలో థ్రెడ్ మిల్‌ పైన గార్భా నృత్యం రూపంలో చేసి, ఔరా అనిపిస్తున్నారు.దానికి సంబంధించిన వీడియోలు సోష‌ల్‌మీడియాలో ఇపుడు వైర‌ల్ కావడం విశేషం.

ఇలాంటి ప‌లు వీడియోలు నెటిజ‌న్ల‌కు స్ఫూర్తిగా నిలుస్తుంటాయి అనడంలో అతిశయోక్తి లేదు.సదరు వీడియోలో ముగ్గురు మ‌హిళ‌లు ట్రెడ్‌మిల్‌పై గార్భా చేస్తూ ఆక‌ట్టుకున్నారు.

ఈ వీడియోను ‘గార్భా వ‌ర‌ల్డ్’ అనే యూజ‌ర్ ఇన్‌స్టాలో షేర్‌ చేయగా వైరల్ అవుతోంది.సదరు వీడియోకి బ్యాక్ గ్రౌండ్లో ‘గార్భేకీ రాత్’ పాట ప్లే అవుతుంటే ట్రెడ్‌మిల్‌పై ఆ మ‌హిళ‌ల‌ గార్బా నృత్యం అద్భుతంగా అనిపిస్తోంది.

ఈ వీడియోను ఇప్ప‌టివ‌ర‌కూ ల‌క్షకి పైగా వీక్షించారు.అలాగే వేళల్లో లైక్స్ వస్తున్నాయి.

సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల కంటే ఎక్కువ వేతనం .. భారత సంతతి సీఈవో అరుదైన ఘనత..!!
పుష్ప 2 సినిమా కోసం ఫాహాద్ ఫజిల్ ఎంత రెమ్యూన రేషన్ తీసుకుంటున్నాడో తెలుసా..?

అద్భుతంగా డ్యాన్స్ చేశారు అని కొందరు వారికి కితాబిస్తున్నారు.చీర‌క‌ట్టుకొని ట్రెడ్‌మిల్‌పై నృత్యం చేయ‌డం సుర‌క్షితం కాద‌ని మ‌రికొంద‌రు వారికి సలహాలు కూడా ఇస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు