వైరల్: ఓ కుక్కపిల్లకు మూడు చెరువులు నీళ్లు తాగించిన కోడి పిల్ల... ఫన్నీ వీడియో!

వినడానికి నమ్మశక్యంగా లేదు కదూ.ఎందుకంటే, సాధారణంగా కోడి పిల్ల( baby chicken ) కంటే కుక్క పిల్ల బలంగా ఉంటుంది మరి.

ఐతే అలాంటి ఓ కోడిపిల్ల ఓ కుక్కపిల్లకు మూడు చెరువులు నీళ్లు తాగించింది.సాధారణంగా మనం సోషల్ మీడియాలో కోళ్లను వేటాడుతున్న కుక్కలను మాత్రమే చూస్తూ ఉంటాం.

అయితే చాలా అరుదుగా ఇలా కుక్కలను వేటాడే కోడి పిల్లలకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను చాలా అలరిస్తూ ఉంటాయి.

తాజాగా ఆ రకానికి చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియోను చూసిన నెటిజన్లు అయితే చక్కిలిగింతలు పెట్టకుండానే తెగ నేవ్వేసుకుంటున్నారు.అవును, వైరల్ అవుతున్న వీడియోలో ఓ కోడి పిల్ల ఓ కుక్క పిల్లను వెంటాడడం మనం చాలా స్పష్టంగా చూడవచ్చు.

Advertisement

కోడి పిల్ల దాన్ని తన ముక్కుతో పొడిచి పొడిచి తరిమితరిమి కొట్టడం ఇక్కడ చూడవచ్చు.ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమంటే, ఆ కోడి పిల్ల తల్లి కుక్క ముందే దాని బిడ్డతో ఫైట్ చేయడం.

ఈ క్రమంలో ఆ కుక్క పిల్ల దాని తల్లి చాటున దాక్కున్నప్పటికీ ఆ కోడి పిల్ల తల్లి కుక్క( dog ) మీద ఎక్కి మరీ కుక్క పిల్ల మీదకు దూకి తరిమింది.కాగా ఈ వీడియోని చూసి నెటిజన్లు పులకించిపోతున్నారు.ఈ క్రమంలో రకరకాల కామెంట్లు దానిపై గుప్పిస్తున్నారు.

‘రెజ్లింగ్ సూపర్ స్టార్ జాన్ సీనా’తో ఆ కోడి పిల్లను పోలుస్తున్నారు.ఈ వీడియోకు ఇప్పటివరకు 92 వేలకు పైగా లైకులు రాగా 20 లక్షలకు పైగా వీక్షణలు రావడం విశేషం.

ఇక కామెంట్లకైతే లెక్కేలేదు.ఇలాంటి అరుదైన ఘటన తాము తమ జీవితంలో ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేదంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఈ ఒక్క సెట్టింగుతో స్పామ్ కాల్స్ నుండి ఉపశమనం పొందండి!
Advertisement

తాజా వార్తలు