ప్రభాస్ సినిమా కోసం సంజయ్‌ దత్‌ పారితోషికం ఎంతో తెలుసా?

ప్రభాస్ ప్రస్తుతం లెక్క కు మించిన సినిమాలు చేస్తున్నాడు.అందులో మారుతి దర్శకత్వంలో ఒకటి అనే విషయం తెలిసిందే.

 Sanjay Dutt Remuneration For Maruthi Prabhas Movie , Prabhas Movie , Maruthi, Sa-TeluguStop.com

ఈ సినిమా పై ప్రభాస్‌ అభిమానుల్లో మొదట అసంతృప్తి ఉండేది.కానీ ఇప్పుడు స్వయంగా ప్రభాస్( Prabhas ) అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అనడంలో సందేహం లేదు.

మారుతి గత చిత్రాలను గురించి పట్టించుకోకుండా ఆయన ప్రస్తుతం ప్రభాస్ తో చేస్తున్న సినిమా గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా ఒక మంచి సినిమా వీరి కాంబినేషన్ లో వస్తుంది అనే నమ్మకం కలుగుతోంది అంటూ అభిమానులు ధీమా తో ఉన్నారు.ఇక ఈ సినిమాలో నటించే నటీనటుల గురించి తెలిసిన సందర్భంలో కూడా అభిమానులకు ఈ సినిమా పై మరింత నమ్మకం కలుగుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.

ఈ సినిమాలో ప్రభాస్ కి తాత పాత్ర లో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్( Sanjay Dutt ) నటించబోతున్నాడు అనే వార్తలు రెండు మూడు నెలల క్రితమే వచ్చిన విషయం తెలిసిందే.

Telugu Salaar, Maruthi, Prabhas, Sanjay Dutt-Movie

ఈనెల చివర్లో లేదా వచ్చే నెల నుండి ప్రభాస్, మారుతి( Prabhas, Maruti ) కాంబినేషన్ సినిమా షూటింగ్ లో సంజయ్ దత్ పాల్గొనబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.ఇక ఈ సినిమా లో 30 రోజుల పాటు నటించేందుకు గాను సంజయ్ దత్ దాదాపు 6 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న విషయం తెలిసిందే.

వారు ఈ సినిమా కోసం ఎంత ఖర్చైనా భరించేందుకు సిద్ధంగా ఉన్నారు.ప్రభాస్ కి దాదాపుగా రూ.100 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చి ఈ సినిమా ను చేస్తున్నట్లుగా తెలుస్తోంది.మారుతీ ఈ సినిమా కోసం ప్రభాస్ నుండి భారీ ఎత్తుగా డేట్లు ఏమీ అడగలేదు.

అలాగే సంజయ్ దత్ తో కూడా కేవలం 30 రోజుల్లోనే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసేలా ప్లాన్ చేశాడట.మొత్తానికి పకడ్బందీగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేయడం వల్ల ఇప్పుడు మారుతి కి ఈజీ అయ్యిందని అంటున్నారు.

సంజయ్ దత్ ఈ సినిమా లో నటించడం వల్ల హిందీ లో మంచి మార్కెట్ క్రియేట్ అయ్యే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube