వైరల్: ఓ కుక్కపిల్లకు మూడు చెరువులు నీళ్లు తాగించిన కోడి పిల్ల... ఫన్నీ వీడియో!

వినడానికి నమ్మశక్యంగా లేదు కదూ.ఎందుకంటే, సాధారణంగా కోడి పిల్ల( baby chicken ) కంటే కుక్క పిల్ల బలంగా ఉంటుంది మరి.

 Viral Chicken Who Drank Three Ponds Of Water For A Puppy Funny Video, Hen, Viral-TeluguStop.com

ఐతే అలాంటి ఓ కోడిపిల్ల ఓ కుక్కపిల్లకు మూడు చెరువులు నీళ్లు తాగించింది.సాధారణంగా మనం సోషల్ మీడియాలో కోళ్లను వేటాడుతున్న కుక్కలను మాత్రమే చూస్తూ ఉంటాం.

అయితే చాలా అరుదుగా ఇలా కుక్కలను వేటాడే కోడి పిల్లలకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను చాలా అలరిస్తూ ఉంటాయి.

తాజాగా ఆ రకానికి చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియోను చూసిన నెటిజన్లు అయితే చక్కిలిగింతలు పెట్టకుండానే తెగ నేవ్వేసుకుంటున్నారు.అవును, వైరల్ అవుతున్న వీడియోలో ఓ కోడి పిల్ల ఓ కుక్క పిల్లను వెంటాడడం మనం చాలా స్పష్టంగా చూడవచ్చు.

కోడి పిల్ల దాన్ని తన ముక్కుతో పొడిచి పొడిచి తరిమితరిమి కొట్టడం ఇక్కడ చూడవచ్చు.ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమంటే, ఆ కోడి పిల్ల తల్లి కుక్క ముందే దాని బిడ్డతో ఫైట్ చేయడం.

ఈ క్రమంలో ఆ కుక్క పిల్ల దాని తల్లి చాటున దాక్కున్నప్పటికీ ఆ కోడి పిల్ల తల్లి కుక్క( dog ) మీద ఎక్కి మరీ కుక్క పిల్ల మీదకు దూకి తరిమింది.కాగా ఈ వీడియోని చూసి నెటిజన్లు పులకించిపోతున్నారు.ఈ క్రమంలో రకరకాల కామెంట్లు దానిపై గుప్పిస్తున్నారు.‘రెజ్లింగ్ సూపర్ స్టార్ జాన్ సీనా’తో ఆ కోడి పిల్లను పోలుస్తున్నారు.ఈ వీడియోకు ఇప్పటివరకు 92 వేలకు పైగా లైకులు రాగా 20 లక్షలకు పైగా వీక్షణలు రావడం విశేషం.ఇక కామెంట్లకైతే లెక్కేలేదు.

ఇలాంటి అరుదైన ఘటన తాము తమ జీవితంలో ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేదంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube