వైరల్: మామిడి ఆకులపై బంపర్ అఫర్ ప్రకటించిన అమెజాన్..!

ఈ రోజుల్లో ప్రతి ఒక్కటీ వ్యాపారం అయిపోయింది.గతంలో ఏ శుభకార్యం జరిగినా మామిడి తోరణాలు కట్టేవారు.

ఉగాది వస్తే చాలు మామిడి పూతను ఉగాది పచ్చడికి వాడేవారు.అలాంటి మామిడి తోరణాలు ఇప్పుడు ఎక్కువగా కనిపించడం లేదు.

ఎక్కడ చూసినా ప్లాస్టిక్ మామిడి ఆకులు అనేవి దర్శనమిస్తున్నాయి.శుభకార్యాలు అనేవి ఇప్పుడు ఆర్టిఫిషియల్ అయిపోయాయి.

తాజాగా ఆన్ లైన్ అమ్మకాలు అనేవి మితిమీరిపోతున్నాయి. అమెజాన్, ఫ్లిఫ్ కార్ట్ వంటివి రావడం వల్ల ఆన్ లైన్ సేలింగ్స్ బాగా పెరిగిపోయాయి.

Advertisement

షాప్ కు వెళ్లి ఎక్కువ సమయం గడపడం కంటే ఇంట్లోనే ఉండి క్షణాల్లో కోరుకున్నది పొందాలని చాలా మంది అనుకుంటున్నారు.ప్రజలు ఇటువంటి వాటికి ఎక్కువగా అలవాటు పడటం వలన ఆన్ లైన్ వ్యాపారాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

చాాలా మంది ఇప్పుడు వారికి ఏం కావాలన్నా కూడా ఆన్ లైన్ లోనే షాపింగ్ చేయడానికి సిద్దమవుతున్నారు.పండగలకు, ఫంక్షన్లకు, పెళ్లి వేడుకలకు ఇలా ఏ కార్యక్రమం అయినా సరే ఆన్ లైన్ షాపింగ్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

తాజాగా మామిడి ఆకులను కూడా అమెజాన్ అమ్ముతుండటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.కరోనా టైంలో చాలా మంది బయటకు వెళ్లడానికి ఇష్టపడటం లేదు.

ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుతుండటం వలన చాలా మంది బయటకు వస్తున్నారు.దాంతో పాటుగా శ్రావణ మాసాలు, పండగలు కూడా కొన్ని వస్తున్నాయి.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

వాటికి కావాల్సిన పూజా సామాగ్ర, వస్తువులన్నీ కూడా ఆన్ లైన్ లోనే అందుబాటులోకి దొరుకుతున్నాయి.ఏ శుభకార్యానికి అయినా సరే మామిడి తోరణాలు కట్టడం అందరికీ అలవాటు.

Advertisement

ఇంట్లో కూర్చొని ఫోన్ లోనే అమెజాన్ లో మామిడాకులు ఎన్ని కావాలంటే అన్ని ఇప్పుడే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు.

ఇకపోతే వీటి ధర విషయానికి వస్తే అమెజాన్ లో 21 మామిడాకులు కేవలం రూ.299లుగానే అమ్ముతున్నారు.అందులో కూడా రూ.190 ఆఫర్‌పై రూ.109లకు మాత్రమే మామిడి ఆకులను అందిస్తామని అమెజాన్ తెలపడం విశేషంగా చెప్పొచ్చు.ప్రస్తుతం దీనిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

తాజా వార్తలు