మృతుడి కుటుంబానికి గ్రామస్తుల చేయూత

రాజాన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని మల్యాల గ్రామానికి చెందిన బంటు ఆనందం గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా అతడి కుటుంబానికి గ్రామస్తులు అండగా నిలిచారు.

మృతుడిది నిరుపేద కుటుంబం, ఇద్దరు చిన్నపిల్లలు ఉండడంతో చలించిపోయిన గ్రామస్తులు 18500 రూపాయల ఆర్థిక సహాయాన్ని శుక్రవారం ఆ కుటుంబానికి అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు.

ఆపదలో ఉన్నవారికి అనునిత్యం అండగా నిలిచే వివేకానంద సేవా సమితి సభ్యులు రెండు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ఎన్నారైల చేయూత

ఉపాధి నిమిత్తం సౌదీ వెళ్లిన పొలాస అంజయ్య,పొలాస శంకర్ లు బంటు ఆనందం మృతి గురించి తెలుసుకొని 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన వారికి దాతలు సహకారం అందజేయవలసిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో మందాల అబ్రహం, గొర్రె నందు, మాదం బాబు, పాటి సుధాకర్, లోకోజు సతీష్, కొడగంటి గంగాధర్ , పొలాస సంతోష్, మాదాడి కరుణాకర్ రావు, గొంటి క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్ల ప్రభుత్వ స్కూల్ విద్యార్ధి హేమంత్ ప్రతిభకు గుర్తింపు
Advertisement

Latest Rajanna Sircilla News