ఏపీలో గ్రామ వాలంటీర్‌ ఆత్మహత్య

వైకాపా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన గ్రామ వాలంటీర్‌ వ్యవస్థపై ఒక వైపు ప్రశంసలు కురుస్తుండటంతో పాటు మరో వైపు విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

తెలుగు దేశం పార్టీ వారికి వ్యతిరేకంగా వాలంటీర్‌లు ప్రవర్తిస్తున్నారంటూ కొందరు ఆరోపిస్తున్నారు.

వైకాపా ప్రతినిధులుగా మాత్రమే వాలంటీర్లు వ్యవహరిస్తున్నారు అంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.కొందరు వాలంటీర్లు వ్యక్తిగతంగా కూడా టార్గెట్‌ అవుతున్నారు.

అలా చాలా మంది వాలంటీర్లు తమ జాబ్‌ను వదిలేస్తున్నారు.తాజాగా ఒక వాలంటీర్‌ ఏకంగా వేదింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.

పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం జీలుగు మిల్లి మండలం పండువారి గూడెంకు చెందిన పండు నవీన అనే 22 ఏళ్ల వాలంటీర్‌ గ్రామస్తురాలి వేదింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది.గ్రామంకు చెందిన మంగ అనే మహిళ తన ఆధార్‌ కార్డులోని పేరును మార్చాలంటూ చాలా రోజులుగా నవీనను అడుగుతోంది.

Advertisement

అయితే అది తన పరిధిలోకి రాదని, మీ సేవకు వెళ్లి మార్చుకోవాల్సిందిగా కోరింది.కాని మంగ మాత్రం కాస్త సీరియస్‌గా నవీనను తిట్టేసింది.దాంతో ఆమె మనస్థాపం చెంది ఇంటికి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది.

ఆత్మహత్య చేసుకున్న నవీనకు పోస్ట్‌మార్టం నిర్వహించి కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు.ఈ విషయమై ప్రభుత్వ పెద్దలు స్పందించాలంటూ నవీన కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు