కరోనా కష్టకాలంలో రాష్ట్రంలో ఇంటింటికి తిరిగి వైద్య పరీక్షలు నిర్వహిస్తూ సమాచారాన్ని తెలుసుకుంటూ ఉన్నతాధికారులకు ఆ సమాచారాన్ని చేరవేస్తూ దేశంలోనే అత్యధిక కోవిడ్ టెస్ట్ లు చేసిన రాష్ట్రంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని నిలిపింది ముమ్మాటికీ వాలంటీర్లు.ఈ వ్యవస్థను ప్రస్తుతం ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ప్రశంసిస్తున్నారు.
మరి అలాంటి వ్యవస్థ ఏర్పాటు చేసిన జగన్ ను మరియు ఈ వ్యవస్థను మొదటి నుండి విమర్శిస్తున్న చంద్రబాబు ఇప్పుడు సమాధానం చెప్పమంటే అర్థరహిత ఆరోపణలు చేస్తున్నాడని పంచాయతీరాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
మరి మన కోసం ఇన్ని సేవలు చేస్తున్న వీరికి అక్టోబర్ 2వ తేదీన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేద్దామని మంగళవారం మీడియా సమక్షంలో పంచాయతీరాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
ప్రజలందరూ వీరికి చప్పట్లు కొట్టి తమ కృతజ్ఞతలు తెలియజేయాలని పిలుపునిచ్చారు.గ్రామ సచివాలయం గ్రామ వాలంటీర్ల వ్యవస్థలను ఏర్పాటు చేసిన జగన్ సర్కార్ ఆలోచన ఒక సరికొత్త శకానికి స్ఫూర్తి.
ప్రస్తుతం ఈ రెండు వ్యవస్థలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.ఇక గ్రామ సచివాలయాల ద్వారా 546 సేవలు, వాలంటీర్ల ద్వారా ప్రస్తుతం 35 సేవలు అందిస్తున్నామని ఆయన తెలియజేశారు.