పుష్ప స్పెషల్ అంటోన్న సాహో బ్యూటీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేస్తుడటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Shraddha Kapoor Special Song In Pushpa, Shraddha Kapoor, Pushpa, Special Song, A-TeluguStop.com

ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు బన్నీ రెడీ అవుతున్నాడు.కాగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను సుకుమార్ తీర్చిదిద్దుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి.

ఇక ఈ సినిమాలో బన్నీ రఫ్ లుక్‌లో కనిపిస్తుండగా, ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా వస్తుందని చిత్ర యూనిట్ అంటోంది.కాగా ఈ సినిమాలో బన్నీ ఓ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాను పక్కా కమర్షియల్ పంథాలో తెరకెక్కిస్తున్న సుకుమార్, ఇందులో ఓ హాట్ ఐటెం సాంగ్‌ను కూడా పెట్టేందుకు రెడీ అవుతున్నాడు.తన గత చిత్రాల్లో లాగే ఈ సినిమాలోనూ ఓ స్టార్ బ్యూటీతో చిందులు వేయించేందుకు సుక్కు ప్లాన్ చేస్తున్నాడు.

కాగా ఈ స్పెషల్ సాంగ్‌లో చిందులేసేందుకు సాహో చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ను ఒప్పించే పనిలో పడ్డాడట సుకుమార్.బాలీవుడ్‌లో హాట్ అందాలతో పాటు అదిరిపోయే స్టెప్పులు వేయడంలో ఈ పాప తనకంటూ ప్రత్యేక గుర్తింపును క్రియేట్ చేసుకుంది.

దీంతో ఇప్పుడు శ్రద్ధా కపూర్‌తో ఓ స్పెషల్ సాంగ్ చేయిస్తే ఈ సినిమాకు మరింత క్రేజ్ తీసుకురావచ్చని సుకుమార్ భావిస్తున్నాడు.మరి ఈ సినిమాలో నిజంగానే శ్రద్ధా కపూర్ ఐటెం సాంగ్ చేస్తుందా లేదా అనేది చూడాలి.

కాగా ఈ సినిమాలో బన్నీ సరసన అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube