"శరపంజరం"చిత్రం లోని మొదటి పాటను విడుదల చేసి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్

గంగిరెద్దుల అబ్బాయి జోగిని అమ్మాయి ప్రేమలో పడితే ఎం జరిగింది.

ఆఊరి దొర మరియు గ్రామ ప్రజలు వీరిపై ఎలాంటి  వ్యతిరేకత కనపరచారు అనే  పల్లెటూరు నేపధ్యంలో సాగే కథాంశంతో వస్తున్న చిత్రమే శరపంజరందోస్తాన్ ఫిలిమ్స్ బ్యానర్ పై నవీన్ కుమార్ గట్టు, లయ జంటగా నవీన్ కుమార్ గట్టు దర్శకత్వంలో టీ.

గణపతి రెడ్డి ,మల్లిక్ ఎం వీ కే నిర్మిస్తున్న ఈ చిత్రం లోని మొదటి పాటను, మరియు, ఫస్ట్ గ్లిమ్స్ ను హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ గారు మొదటి పాటను విడుదల చేయగా.

సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ ఫస్ట్ గ్లిమ్స్ ను విడుదల చేశారు.మామిడాల హరికృష్ణ ,ఉడుగుల వేణు లు నాలుగు నిమిషాల డి.సి.పి ని రిలీజ్ చేశారు.ఇంకా ఈ కార్యక్రమంలో ఈటెల జమున, లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్, చరణ్, మరాఠీ దర్శకుడు నవీన్ దేశబోయిన, టిప్స్ మ్యూజిక్ రాజు హిర్వాని, దర్శకుడు వినయ్ బాబు గౌడ్, మ్యూజిక్ డైరెక్టర్, యమ్.అల్.రాజ, అమూల్యతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.

కాలం మారినా ఇంకా కొన్ని చోట్ల జోగిని లాంటి దూరాచారాలు మారకుండా ఇంకా కొనసాగుతున్నాయి.వాటిని రూపు మాపే క్రమంలో చిత్ర, దర్శక, నిర్మాతలు జోగిని వంటి సామాజిక సబ్జెక్ట్ ను సెలెక్ట్ చేసుకున్నారు.

Advertisement

ఈ సినిమాలో హీరో,హీరోయిన్ లు చాలా బాగా నటించారు.పాటలు చాలా బాగున్నాయి.

మంచి చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్ర యూనిట్ కు మంచి పేరు రావాలని కోరుతున్నాను అన్నారు.మామిడి హరికృష్ణ మాట్లాడుతూ.

చిన్నప్పటి నుండి వేదికలపై కళలను ప్రదర్శించిన కళాకారుడు సినిమాలో కనిపించాలి.తన కథలను సినిమాగా తెరకెక్కించాలి తనే నటించాలి.

తనే కనిపించాలి.తన హృదయాన్ని తెరపై ఆవిష్కరింప జేయాలనే ఒక స్వప్నం.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
వీడియో వైరల్ : ఏంటి రింకూ సింగ్ మరీ డబ్బులు అంత ఎక్కువయ్యాయ?

దాదాపు కొన్ని ఏళ్ల నుంచి కల కంటూ.కంటూ.

Advertisement

ఉన్న స్వప్నం ఈ రోజు నెరవేరడం వెనుక ఒక పట్టుదల ఉంది.తపన ఉంది.

కళ పట్ల ఆరాధన ఉంది.అంతకుమించి సృజనాత్మకంగా గొప్ప గౌరవముంది.

ఈ కలకన్న వ్యక్తి ఎవరో కాదు.యువ కళాకారుడు, యువ నటుడు, యంగ్ హీరో నవీన్ కుమార్.

ఈ సినిమా కొరకు ఎన్ని కష్టాలు పడ్డాడో ,ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో, ఎన్ని కన్నీళ్లు కార్చాడో తనకే తెలుసు.తను కన్న కలకు డబ్బులు లేవు కానీ మిత్రుల సహకారంతో పాటు ముఖ్యంగా మల్లిక్ తనే ఈ సినిమాకు మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఇస్తూ వీరికి తోడుగా నిలిచారు.

మరీ ముఖ్యంగా తెలంగాణ శాసన సబ్యుడు ఈటెల రాజేందర్గారి సహకారం కూడా లభించింది.ఇలా అందరి సహకారంతో అంతరించి పోతున్న మన జీవనశైలిని తెరమీద ఆవిష్కరిస్తున్న గొప్ప సినిమా "శరపంజరం".

మంచి సబ్జెక్ట్ తో వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.ఆర్ర్.

పి.పట్నాయక్ మాట్లాడుతూ.ఈ సినిమా క్లిప్పింగ్ చూసిన తరువాత జోగిని వంటి దురాచారాన్ని రూపు మాపాలని తేలియజెస్తూ తీసిన చిత్రమే "శరపంజరం".

ఈ సినిమా కోసం టీం అంతా చాలా కస్థపడ్డారు.ఇలాంటి వ్యవస్థల గురించి నేటి తరం అంతా ప్రశ్నించే విధంగా మరిన్ని మంచి సినిమాలు తీయాలని కోరుతూ ఈ సినిమా గొప్పవిజయం సాదించాలి అన్నారు.

ఈటెల జమున మాట్లాడుతూ."శరపంజరం చిత్ర టైటిల్ లోనే ప్రజలకు పెద్ద అర్థమయ్యేటట్లు ఉంది.ఈ మధ్య ఎక్కువగా యూత్ సినిమాలు వస్తున్నాయి.

జోగినిలు ఎలా బాధపడుతున్నారు ఇది ఆచారమనే పద్ధతి కాకుండా దూరాచారమనే విషయాన్ని తెలిపే సినిమా కాబట్టి.ఇలాంటి సినిమాలు గ్రామాల్లో వుండే మహిళలు కనెక్ట్ అయ్యే విధంగా తీసుకెళ్లాలి.

అలా తీసుకెళితే తెలంగాణలో వుండే మహిళల గుండెలకు హత్తుకునేలా ఉంది ఈ సినిమా.ఈ సినిమా చూసిన తరువాత ఇన్ని రోజులు ఇలాంటి దురాచారం చేశామా అని ఏడ్చే వారు ఎంతో మంది ఉంటారు.

ఇలాంటి మంచి సినిమా తీయడం తెలంగాణ ప్రజల అదృష్టంగా బావిస్తున్నాను.ఇలాంటి దూరచరమైన విషయాలు ఎమున్నాయో తెలుసుకుని వాటిని సినిమా రూపంగా తీసి ఈ వ్యవస్ట ను అభివృద్ధి చేయాలని మా మనస్ఫూర్తిగా కోరుతూ మా మల్లిక్ కు,నవీన్ పట్నాయక్ లకు మూడు పూవులు ఆరు కాయలు కాయాలని దీవిస్తూ.

ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని అన్నారు.వేణు ఉడుగుల మాట్లాడుతూ.

  ఏ పెట్టుబడి లేకుండా జీరో బడ్జెట్ తో తీసిన ఈ చిత్రాన్ని చాలా స్వేచ్ఛగా.నిజాయితీగా.

తీశారని బావిస్తున్నాను.గ్లిమ్స్,సాంగ్స్  చూశాను చాలా బాగుంది.

చిన్న పల్లెటూరు లో వుండే నవీన్ ఈ రోజు సినిమా తీసే స్థాయికి ఎదిగాడు అంటే అది చిన్న విషయం కాదు.తను ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో నాకు తెలుసు.

తనకు సపోర్ట్ గా నిలబడడానికి   మల్లిక్,.గణపతి రెడ్డి ఈ సినిమాను తమా భుజాలపై మోసుకున్నారు.

హీరోయిన్ చాలా బాగా నటించింది.ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని అన్నారు.

కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ.జోగిని వంటి టిపికల్ సబ్జెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి అన్నారు.

చరణ్ మాట్లాడుతూ.నవీన్ గారు మంచి కథను సెలెక్ట్ చేసుకొని మల్లిక్ గారితో చేస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలి అన్నారు.చిత్ర దర్శకుడు నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ.

మా కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.ఈ సినిమా నా 12 సంవత్సరాల కల.నాలాంటి.చిన్న కళాకారుడు ఇండస్ట్రీకి పరిచయం కావాలంటే ఎంతో కొంత చిన్న కథ ఉంటుంది.

ఆ కథకు మూలం మా తాత.మా తాత ,నాన్న, మా అన్న అందరూ  మంచి రచయితలే కానీ ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు.వారు రచయితలు అనే విషయం లోకానికి తెలియక మరుగున పడింది.

అయితే  నేను వారిలా కాకుండా ఉండాలని ఎంతో కష్టపడి  ఈ సినిమాను కథ రాసుకొని తియ్యడం జరిగింది.తెలంగాణ లో మట్టిని ముట్టుకుంటే ఎన్నో కథలు కావ్యాలు, చరిత్రలు బయటికి వస్తాయి.

ఇక్కడ మట్టిని తాకితే రక్తపు మరకలు కూడా వస్తాయి.ఎన్నో పోరాటాల ఉద్యమాలు గుర్తుకు వస్తాయి.

అలాంటి మట్టి నుండి తేరుకున్న కథే ఈ "శరపంజరం".ఈ సినిమాకు పది సంవత్సరాలుగా నాతో వున్నాడు కెమెరామెన్ మస్తాన్ సిరిపాటి.

అలాగే మరికొంత మంది ఫ్రెండ్స్ తో ఈసినిమా చెయ్యడం జరిగింది.అప్పుఫు మల్లిక్,గనపతి సర్లు తొడయ్యారు.

ఈ సినిమాకు కిరణ్ ఇందులో రెండు పాటలు రాశాడు.ఇలా చాలా మంది ఈ సినిమాకు లిరిసిస్ట్స్ గా వర్క్ చేశారు.

కాబట్టి మంచి కథతో వస్తున్న మా సినిమాను ప్రేక్షకులు అందరూ ఆదరించి ఆశీర్వదించాలని అన్నారు.హీరోయిన్ లయ మాట్లాడుతూ.

ఇలాంటి మంచి సామాజిక అంశంలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాత లకు ధన్యవాదాలు.నిర్మాతలు  మల్లిక్, గణపతి రెడ్డి లు మాట్లాడుతూ.

మమ్మల్ని దీవించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.నవీన్ నాకు మంచి సబ్జెక్టు చెప్పాడు.

నాకు ఈ కథ నచ్చడంతో ఈ  సినిమా చేస్తున్నాను.ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ అంతా చాలా కష్టపడ్డారు.

నటీనటులు చాలా చక్కగా నటించారు.ఇందులో ఒక సాంగ్ మించి మరొక సాంగ్ ఉంటుంది.

జబర్దస్త్ టీం అంతా చాలా చక్కగా నటించారు.జోగిని వంటి మంచి కాన్సెప్ట్ తో  వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ జోగిని పై మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని అన్నారు.

నటీనటులు

నవీన్ కుమార్ గట్టు,లయ, వరంగల్ బాషన్న, ఆనంద్ భారతి,జబర్దస్త్ వెంకీ, జబర్దస్త్ జీవన్, జబర్దస్త్ రాజమౌళి, జబర్దస్త్ మీల్కీ, అలువాల సోమయ్య, మౌనశ్రీ మల్లిక్, మేరుగు మల్లేశం గౌడ్, కళ్యాణ్ మేజిషియన్ మానుకోట ప్రసాద్, కృష్ణ వేణీ, ఉదయశ్రీ ,రజీయ, ఉషా, సకేత, రాజేష్ సుదర్శన్, నరేందర్, దయ, భరత్ కామరాజు, ప్రసాద్, ప్రశాంత్, అఖిల్ (బంటి)

సాంకేతిక నిపుణులు

బ్యానర్ : దోస్తాన్ ఫిలిమ్స్, నిర్మాతలు : టీ.గణపతి రెడ్డి ,మల్లిక్ ఎం వీ కే , కథ,మాటలు,స్క్రీన్ ప్లే ,దర్శకత్వం: నవీన్ కుమార్ గట్టు.సంగీతం : మల్లిక్ ఎం వీ కే, కెమెరా: మస్తాన్ సిరిపాటి, ఎడిటింగ్: యాదగిరి కంజర్ల, డీ ఐ : రాజు సిందం.పాటలు : మౌనశ్రీ మల్లిక్,గిద్దె రాం నర్సయ్య,కిరణ్ రాజ్ ధర్మారాపు,అద్వైత్ రాజ్,రాంమూర్తి పొలపల్లి, ఉమా మహేశ్వరి రావుల.పి.ఆర్.ఓ : ఆర్.కె.చౌదరి.

తాజా వార్తలు