ఇంద్రకీలాద్రి: ఇంద్రకీలాద్రి పై సరస్వతి దేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మ.సరస్వతిదేవి దర్శనార్దం క్యూలైన్లో కిలోమీటర్ల మేర బారులు తీరిన భక్తులు.
తెల్లవారుజామున 2 గంటల నుండి అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించిన అధికారులు.మహాకాళీ, మహాలక్ష్మి, మహా సరస్వతి గా శక్తి రూపాలతో దర్శనమిస్తున్న దుర్గమ్మ.
భక్తజనుల అగ్నానాన్ని పారద్రోలి గ్నానజ్యోతిని వెలిగించే గ్నాన ప్రదాయినీ సరస్వతి దేవి.
సరస్వతి దేవి దర్శనం అఖిల విద్యాభ్యుదయ ప్రదాయకం.
అమ్మవారి జన్మనక్షత్రమైన మూలనక్షత్రం కావడంతో దుర్గమ్మను దర్శించుకొని తరిస్తున్న భక్తులు.భక్తుల రద్ది దృష్టిలో ఉంచుకుని అన్ని క్యూలైన్స్ ఉచితమే.
భారి బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.వీఐపీలకు, వృద్దులు, వికలాంగులు ప్రత్యేక దర్శనం ఇవ్వలేమని ఇప్పటికే ప్రకటించిన అధికారులు.