దుర్గ గుడిలో జరిగిన మరో వివాదం..? ఏం జరిగిందంటే..?

విజయవాడలోని( Vijayawada ) ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన కనకదుర్గమ్మ ఆలయం లో( Kanakadurga Temple ) ఎప్పుడూ ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంటుంది.

అయితే తాజాగా మరోసారి మరో వివాదం జరిగింది.

అయితే గుడిలోనీ సిబ్బంది గుడిలో కొబ్బరికాయ కొట్టాలంటే( Coconut ) కచ్చితంగా 20 రూపాయలు చేతుల్లో పెట్టాల్సిందే అని తెగేసి చెబుతున్నారు.అయితే కనకదుర్గమ్మ గుడిలో భక్తుల దగ్గర నుండి కొబ్బరికాయ కొట్టడానికి 20 రూపాయలు వసూలు చేస్తున్నారని కాంట్రాక్టర్ పై భక్తులు మండిపడుతున్నారు.

అయితే కాంట్రాక్టర్ వారానికి 1,80,000 రూపాయలకు టెండర్ పాడుకున్నట్లు తెలుస్తుంది.

అయితే ఆ డబ్బులను భక్తుల దగ్గర నుండి దండుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఫిర్యాదు చేసినప్పటికీ కూడా దుర్గగుడి అధికారులు పట్టించుకోవడంలేదని భక్తులు ఆరోపణలు గుప్పిస్తున్నారు.ఇక సాధారణంగా కొబ్బరికాయ ధర రూ.25 నుంచి రూ.30గా బయట మార్కెట్లో ఉన్నాయి.కానీ ఇక్కడ మాత్రం కొబ్బరికాయ కొట్టడానికి భక్తుల దగ్గర నుండి ఏకంగా రూ.20 వసూలు చేస్తున్నారేంటి అని భక్తులు ఫైర్ అవుతున్నారు.ఇక కొన్ని ఆలయాలలో కొబ్బరికాయలు భక్తులే స్వయంగా కొట్టుకుంటారు.

Advertisement

ఇక మరీ కొన్ని చోట్ల అయితే చిల్లర అడుగుతారు.కొబ్బరికాయలు కొట్టే సిబ్బంది ఇలా భక్తుల దగ్గర నుండి డబ్బులు అడుగుతారు.

అయితే కొన్ని చోట్ల అది రూ.5 వరకు ఉంటుంది.లేదా చిల్లర లేని సమయంలో కొంతమంది ఏ డబ్బు తీసుకోకుండా కొబ్బరికాయలు కొడతారు.కానీ ఇక్కడ మాత్రం ఏకంగా రూ.20 డిమాండ్ చేయడం ఏంటి అని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇక గతంలో దుర్గ గుడికి సంబంధించిన హుండీల లెక్కింపు సమయంలో కే.పుల్లయ్య అనే వ్యక్తి దొంగతనం చేశాడని, అతని అల్లుడికే ప్రస్తుతం కాంట్రాక్టర్ బినామీగా పెట్టారని ఆరోపణలు ఉన్నాయి.అయితే అతను పబ్లిక్ గా భక్తుల వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తున్నా కూడా దుర్గగుడి అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని భక్తులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు