కాంగ్రెస్ పార్టీపై విజయసాయిరెడ్డి సీరియస్ వ్యాఖ్యలు..!!

నేడు పార్లమెంట్ పాత భవనంలో చివరి రోజు సమావేశాలు జరిగాయి.రేపటినుండి కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు జరగబోతున్నాయి.

 Vijayasai Reddy's Serious Comments On Congress Party Congress, Vijayasai Reddy,c-TeluguStop.com

ఈ ప్రత్యేకమైన సమావేశాలలో కేంద్ర ప్రభుత్వం పలు కీలకమైన నిర్ణయాలు బిల్లులు ప్రవేశపెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఎల్లుండి కొత్త పార్లమెంటు భవనంలో మొట్టమొదటిగా మహిళా రిజర్వేషన్ బిల్లుకి ఆమోదం తెలపనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

చివరి రోజు నేపథ్యంలో పాత పార్లమెంట్ భవనంలో పలువురు నేతలతో కాసేపు విజయసాయిరెడ్డి( Vijayasai Reddy ) గడపడం జరిగింది.

ఇదిలా ఉంటే రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ( Congress Party )పై విజయసాయిరెడ్డి సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్లలో 50 ఏళ్లు కాంగ్రెస్సే పాలించింది.కాంగ్రెస్ స్థానంలో మరో పార్టీ ఉంటే దేశం ఎంతో అభివృద్ధి చెందేదని స్పష్టం చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా జరిగింది.యూపీఏ హయాంలో తలుపులు మూసేసి, లైవ్ టెలికాస్ట్ కట్ చేసి బిల్లు పాస్ చేశారు.

ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) ప్రాంతానికి చెందిన ఎంపీలను సస్పెండ్ చేశారు అంటూ విజయసాయిరెడ్డి ఏపీ విభజన తీరుపై పాత పార్లమెంటు రాజ్యసభ చివరి రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube