డ్యూయెల్ రోల్ లో విజయ్.. ఈ రూమర్ నిజమేనా?

కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి కి ఎంత ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈయనకు తమిళ్ లో రజనీకాంత్ తర్వాత అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకుని అక్కడ ప్రజల చేత సూపర్ స్టార్ గా పిలిపించు కుంటున్నాడు.

 Vijay To Play A Dual Role In 'thalapathy 66, Dil Raju, Rashmika Mandanna, Thapalathy 66, Vamsi Paidipally, Beast-TeluguStop.com

ఈయన సినిమా లంటే అక్కడి ప్రేక్షకులు పడి చచ్చిపోతారు.ఈయన గత సినిమా మాస్టర్ 200 కోట్లు వసూలు చేసి కోలీవుడ్ లో సంచలనం నమోదు చేసింది.

ఇక తాజాగా విజయ్ నటించిన సినిమా బీస్ట్.ఈ సినిమా కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించాడు.సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాను ఏప్రిల్ 13న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసారు.అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో వర్కౌట్ అవ్వలేదు.

 Vijay To Play A Dual Role In 'Thalapathy 66, Dil Raju, Rashmika Mandanna, Thapalathy 66, Vamsi Paidipally, Beast-డ్యూయెల్ రోల్ లో విజయ్.. ఈ రూమర్ నిజమేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో మొదటి రోజు నుండే స్లోగా నడిచింది.అలాగే కేజిఎఫ్ సినిమా కూడా ఈ సినిమాను బాగా దెబ్బ కొట్టింది.

దీంతో వసూళ్లు భారీగా పడిపోయాయి.ఇక ఆ తర్వాత కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ తో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు భారీ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.

ఈ సినిమాలో రష్మిక నటిస్తుందని అఫిషియల్ గా కూడా ప్రకటించడమే కాకుండా పూజా కార్యక్రమాలతో షూట్ కూడా మొదలు పెట్టేసారు.వంశీ మొదటిసారి ఒక బై లాంగువల్ సినిమాను ఓకే చెయ్యగా దీనిపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఇటీవలే ఈ సినిమాలో నటిస్తున్న ప్రధాన తారాగణం గురించి మేకర్స్ రివీల్ చేసారు.మరి లేటెస్ట్ గా ఈ సినిమాపై మరొక వార్త నెట్టింట వైరల్ అయ్యింది.ఈ సినిమాలో విజయ్ డ్యూయెల్ రోల్ లో నటించ బోతున్నాడని వార్తలు వస్తున్నాయి.ప్రెసెంట్ అయితే ఈ రూమర్ లో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది.మరి రానున్న రోజుల్లో ఈ సినిమాపై మరింత క్లారిటీ వస్తుందేమో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube