విజయ్ సేతుపతి( Vijay Sethupathi ) హీరోగా కోలీవుడ్ ఇండస్ట్రీలో చాలానే హిట్స్ సాధించాడు.తమిళ ఫిలిం ఇండస్ట్రీలో అతను ఒక హీరోగా గుర్తింపు తెచ్చుకోగలిగాడు.
మిగతా ఇండస్ట్రీలో మాత్రం భయంకర విలన్‌గా పేరు తెచ్చుకున్నాడు.ఉప్పెన, మొన్నీమధ్య వచ్చిన జవాన్ సినిమాలో విజయ్ సేతుపతి ప్రతి నాయకుడిగా ఎలాంటి పర్ఫామెన్స్ కనబరిచాడో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
మళ్లీ ఇలాంటి టెరిఫిక్ పెర్ఫార్మెన్స్‌ను అతడి నుంచి ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.సరిగ్గా ఇదే సమయంలో విజయ్ సేతుపతి ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.
ఆ విషయం తెలిసి చాలామంది ఫాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు.

తమిళ్ మూవీ “మాస్టర్”లో విజయ్ సేతుపతి ఓ పాటకు డ్యాన్స్ కూడా వేశాడు.హీరో విజయ్‌తో సమానంగా అతడు ఈ మూవీలో హైలైట్ అయ్యాడు.విక్రమ్ సినిమాలో కూడా ఆటో నుంచి విజయ్ సేతుపతి దిగే సీన్ థియేటర్లలో ప్రేక్షకుల చేత ఈలలు వేయించింది.
త్వరలో రామ్ చరణ్ బుచ్చిబాబు సనాతో కలిసి తీసే సినిమాలో కూడా విజయ్ సేతుపతి ప్రతి నాయకుడిగా నటించనున్నాడని వార్తలు వచ్చాయి.ఈ క్రమంలోనే విజయ్ సేతుపతి నెగటివ్ రూల్స్ ఇకపై చేయబోవునని ప్రకటించాడు.
హీరోలు, దర్శక నిర్మాతలు ఫోన్ చేసి మరీ తప్పక విలన్ పాత్ర మీరే చేయాలంటూ అడుగుతున్నారట.అయితే వారికి సున్నితంగా సారీ చెబుతూ ఇకపై కథలు చెప్పి ఇబ్బంది పెట్టొద్దని కోరుతున్నాడట.
దాంతో ఒక్కసారిగా ప్రేక్షకులు షాక్ లో పడిపోయారు.

ప్రతి నాయకుడిగా అద్భుతంగా నటించగల విజయ్ ఇప్పుడు ఆ పాత్రలు చేయకపోతే అతన్ని ఎవరు భర్తీ చేస్తారు? అనేది ప్రశ్నార్థకంగా మారింది.విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో సక్సెస్ అయ్యాడు కానీ ఇతర భాషల్లో సక్సెస్ కాలేదు.జవాన్( Jawan movie ) తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అతడిని విలన్ గా పెట్టుకోవాలని చాలామంది భావిస్తున్నారు.
ఇదే పంథాలో నటిస్తే అతడికి తిరుగు ఉండదు కానీ నెగిటివ్ రోల్స్ చేయడం ఇష్టం లేదని చెప్పి ఇప్పుడు అందర్నీ విస్మయానికి గురి చేస్తున్నాడు.మరి ఇదే నిర్ణయానికి అతడు శాశ్వతంగా స్టిక్ అవుతాడా లేదంటే మంచి విలన్ ఛాన్స్ వస్తే చేయడానికి ఒప్పుకుంటాడా అనేది చూడాలి.







