మెరుపుతీగలా మారుతున్న స్టార్ యాక్టర్.. అంతా ఆమె పుణ్యమే!

తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి యాక్టింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

తనదైన యాక్టింగ్‌తో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతి, ఎంచుకునే కథలు కూడా విలక్షణంగా ఉంటాయి.

అందుకే తమిళ తంబీలు ఆయన నటించే ప్రతి సినిమాను మిస్ కాకుండా చూస్తుంటారు.ఇక విజయ్ సేతుపతి ఒక సినిమాలో ఉన్నాడంటే, ఖచ్చితంగా ఆ సినిమాలో మ్యాటర్ ఉంటుందనే ఫీలింగ్ తమిళ ఆడియెన్స్‌లో ఉంటుంది.

కాగా ప్రస్తుతం ఆయన లీడ్ రోల్స్ మాత్రమే కాకుండా క్యారెక్టర్ పాత్రలు కూడా చేస్తూ సినిమాల్లో నటిస్తున్నాడు.ఇప్పటికే తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన మాస్టర్ చిత్రంలో విలన్ పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తుండటంతో ఆ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి.

అటు తెలుగులోనూ ఉప్పెన చిత్రంతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు సేతుపతి రెడీ అయ్యాడు.కాగా ఇప్పుడు ఓ స్టార్ బ్యూటీ కోసం ఆయన మెరుపుతీగలా మారబోతున్నాడు.

Advertisement

లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా మారిపోయిన తాప్సీ నటిస్తున్న ఓ సినిమాలో విజయ్ సేతుపతి కేమియో పాత్రలో నటించేందుకు ఓకే చెప్పాడు.దీపక్ సందర్‌రాజన్ అనే డైరెక్టర్ తెరకెక్కించనున్న ఈ సోషల్ డ్రామా మూవీని తమిళంతో పాటు బాలీవుడ్‌లోనూ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

తాప్సీ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండనుండగా, అంతే స్థాయిలో విజయ్ సేతుపతి పాత్ర కూడా ఉంటుందని తెలుస్తోంది.కేవలం హీరో, విలన్ పాత్రలే కాకుండా నటనకు పెద్దపీట వేసే ప్రతి పాత్రలోనూ తాను నటిస్తానంటూ విజయ్ సేతుపతి దూసుకుపోతున్నాడు.

ఇక ఈ సినిమాలో ఆయన నటిస్తున్నాడని తెలియగానే ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

అందుకే నేను ఏ రోజు సొంత పిల్లల గురించి ఆలోచించ లేదు : రాజమౌళి
Advertisement

తాజా వార్తలు