సేతుపతి గొప్ప నటుడు అనడానికి ఆ సీనే ఉదాహరణ!

తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి గురించి అందరికీ తెలిసిందే.నట జీవితంలో ఆయనకున్న అభిమానం అంతా ఇంతా కాదు.

తమిళం, తెలుగు, మలయాళం, హిందీ సినిమాల్లో చేసిన ఆయన తెలుగు రాష్ట్రాల్లో కూడా అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు.ఆయన ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు.

సినీనటుడు గానే కాకుండా నిర్మాత, స్క్రీన్ రైటర్, ప్లే బ్యాక్ సింగర్ గా పేరును సంపాదించుకున్నాడు.చిన్న సినిమాతో చిన్న పాత్రలో వెండితెరకు పరిచయం అయిన విజయ్ సేతుపతి ప్రస్తుతం ఓ రేంజ్ లో పేరును సంపాదించుకున్నాడు.

మొదటిసారి పిజ్జా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ సేతుపతి పలు భాషల్లో కూడా అందరిని ఆకట్టుకున్నాడు.అంతేకాకుండా డబ్బింగ్ సినిమాల ను కూడా చేశాడు.

Advertisement

ఆయన తమిళంలో నటించిన సినిమా ఓటీటీ లో విడుదల కాగా మంచి విజయాన్ని అందుకుంది.

ఇదిలా ఉంటే తెలుగు సినీ పరిశ్రమలో కూడా నటించగా.చిరంజీవి నటించిన సైరా సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడు.ఇక తాజాగా థియేటర్లలో ఓ రేంజ్ లో దూసుకుపోతున్న ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి పాత్ర మొత్తం బాగా ఆకట్టుకుంది.

ఆ సినిమాల్లో ఆయన నెగెటివ్ రోల్ లో నటించగా ఆయన విశ్వరూపం మాత్రం ఆ సినిమాకు మంచి విజయాన్ని అందించిందని అర్థమవుతుంది.ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి పాత్ర శేషారాయణం.

ఈ పాత్రలో ఆయన హీరోయిన్ కృతి శెట్టి తండ్రిగా మెప్పించాడు.ఈ సినిమాలో ప్రతి ఒక్క సీన్ లో విజయ్ సేతుపతి పాత్ర సినిమానే డామినేట్ చేసేలా ఉంది.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

ఈ సినిమాలో క్లైమాక్స్ లో తండ్రి కూతురు మధ్య జరిగిన సీన్ మాత్రం ఓ రేంజ్ లో హిట్ సాధించింది.చివర్లో కృతి శెట్టి విజయ్ సేతుపతి తో మనసుకు తాకే మాటలతో బాగా ఆకట్టుకుంది.

Advertisement

ఇందులో విజయ్ సేతుపతి నోట నుంచి ఒక్క డైలాగ్ కూడా రాకుండా కేవలం హావభావాలతో సీన్ చేశారు.విలన్ పాత్ర గా ఉన్న విజయ్ సేతుపతి చివర్లో కృతి డైలాగులతో మనిషిలా మార్తాడు.

ఏ ఒక్క డైలాగ్ ని ఇవ్వకుండా కేవలం ముఖంపై భావోద్వేగాలను చూపిస్తూ బాగా మెప్పించాడు.ఈ సీన్ తోనే విజయ్ సేతుపతి గొప్పగా ఆకట్టుకున్నాడు.

తాజా వార్తలు