మురళీధరన్ రూపంలోకి పరకాయ ప్రవేశం చేసిన విజయ్ సేతుపతి

శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ని తెరకెక్కించడానికి రంగం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీగా దీనిని ఆవిష్కరించబోతున్నారు.

ఇండియన్ భాషలతో పాటు అవకాశాన్ని బట్టి సింహళీ, ఇంగ్లీష్ బాషలలో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది.శ్రీపతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని షూటింగ్ కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు.శ్రీలంకలో స్థిరపడిన తమిళ వ్యక్తి మురళీధరన్ అనే విషయం అందరికి తెలిసిందే.

ఈ నేపధ్యంలో తమిళ ప్రజలు కూడా మురళీధరన్ తో ఎక్కువ ఎటాక్ మెంట్ కలిగి ఉంటారు.అతను పెళ్లి చేసుకున్నది కూడా తమిళనాడుకి చెందిన అమ్మాయినే కావడం విశేషం.

Advertisement

ఈ నేపధ్యంలో మురళీధరన్ బయోపిక్ తీస్తే అందరికి కనెక్ట్ అవుతుందని భావించి అతని అనుమతితో దీనికి రంగం సిద్ధం చేశారు.ఇదిలా ఉంటే 800 టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకి సంబందించిన టైటిల్, ఫస్ట్ లుక్ మోషన్ టీజర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఈ టీజర్ లో అతను క్రికెట్ కెరియర్ ప్రారంభించినప్పటి నుంచిఅంతర్జాతీయ స్థాయిలో తన బౌలింగ్ శైలితో ఎదుర్కొన్న అవమానాలు, టెస్ట్ క్రికెట్ లో 800 వికెట్లు సాధించిన విజువల్ ని ఎలివేట్ చేసి ఫైనల్ గా మురళీధరన్ లుక్ లో విజయ్ సేతుపతిని ఆవిష్కరించారు.విజయ్ సేతుపతి ఈ మోషన్ టీజర్ లో అచ్చం మురళీధరన్ లానే కనిపించడం విశేషం.

అతని లుక్ చూసి మురళీధరన్ లోకి విజయ్ పరకాయ ప్రవేశం చేసేశాడు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే ఒక శ్రీలంక క్రికెటర్ కి సంబందించిన బయోపిక్ లో తమిళుడు అయిన విజయ్ ఎలా నటిస్తాడని, ఆ దేశంలో తమిళ ప్రజలని ఎలా ఊచకోత కోసారో మరిచిపోయారా అంటూ కొంత మంది తమిళ సంఘాలకి చెందిన వారు విమర్శలు చేస్తున్నారు.

ఏది ఏమైనా మురళీధరన్ బయోపిక్ ఇప్పుడు తమిళనాడులో రెండు రకాలుగా ట్రెండ్ కావడం విశేషం.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు