ఏపీలో గత ఏడేళ్లుగా విశాఖ జిల్లాతో పాటు కీలకమైన ఉత్తరాంధ్ర రాజకీయాల్లో విజయ సాయి రెడ్డి హవా నడుస్తోంది.గత ఎన్నికలకు ముందు నుంచే ఆయన ఉత్తరాంధ్ర వైసీపీ వ్యవహారాల్లో కీలకంగా మారారు.2014 ఎన్నికల్లో ఇక్కడ జగన్ తన తల్లి విజయలక్ష్మిని పోటీ పెట్టగా ఆమె ఎన్నికల్లో ఓడిపోయారు.ఆ తర్వాత ఆమె రాజకీయాలకు సైలెంట్ అయిపోవడంతో ఉత్తరాంధ్రలో తన నమ్మిన బంటు ఒకరు ఉండాలని భావించిన జగన్ సాయిరెడ్డికి పార్టీ పరంగా పూర్తి బాధ్యతలు అప్పగించారు.
అప్పుడు రంగంలోకి దిగిన సాయిరెడ్డి మూడు జిల్లాల్లో ఎక్కడికక్కడ క్యాస్ట్ ఈక్వేషన్లు సెట్ చేయడంతో పాటు టీడీపీని అనేక సమీకరణలతో దెబ్బ కొట్టారు.
చివరకు గత ఎన్నికల్లో వైసీపీ ఉత్తరాంధ్రలో దూసుకుపోయింది.
మూడు జిల్లాల్లో ఆ పార్టీకి కేవలం ఆరు అసెంబ్లీ సీట్లతో పాటు శ్రీకాకుళం ఎంపీ సీటు మాత్రమే వచ్చింది.ఇక పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సాయిరెడ్డి పెత్తనమే అక్కడ నడుస్తోంది.
సాయిరెడ్డి పెత్తనంపై విశాఖ మంత్రులు, ఎమ్మెల్యేలే కాకుండా ఉత్తరాంధ్ర లో మిగిలిన జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రగి లి పోతున్నారు.ఇక మొన్నటి స్థానిక ఎన్నికల్లో కార్పొరేటర్ సీట్లను కూడా చాలా వరకు సాయిరెడ్డే డిసైడ్ చేశారు.

ఓవరాల్‌గా విశాఖ నగరంపై ఆయన తన పట్టు కొనసాగిస్తూ వస్తున్నారు.అయితే ఇప్పుడు పంచాయతీల్లో మూడు జిల్లాల్లోనూ మెజార్టీ పంచాయతీలు వైసీపీ ఖాతాలో పడేలా చూసే బాధ్యత మీదే అని జగన్ సాయిరెడ్డికి వార్నింగ్ ఇచ్చారట.ఉత్తరాంధ్రలో టీడీపీని సంస్థాగతంగా కూడా దెబ్బకొట్టేందుకు జగన్ విశాఖను పరిపాలనా రాజధానిగా కూడా చేశారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ ప్రజలు వైసీపీకి పట్టం కట్టకపోతే అది పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ అవుతుంది.
అందుకే జగన్ ఇక్కడ బాధ్యతలను విజయ సాయి చేతుల్లోనే పెట్టారట.ఇప్పుడు విజయ సాయి అసలు సిసలు సత్తా చాటాల్సిన బాధ్యత ఆయనపై ఉంది.

అక్కడ ఫలితాలు ఫ్యాన్‌కు సానుకూలంగా రాకపోతే ఆ ప్రభావం విజయసాయికి జగన్‌కు మధ్య ఉన్న సంబంధాలపై ఖచ్చితంగా పడుతోంది.మరోవైపు విజయసాయికి ఉత్తరాంధ్రలో పార్టీలో ఉన్న గ్రూపు తగాదాలను పరిష్కరించడమే పెద్ద తలనొప్పిగా మారింది.వీటిని అధిగమించి ఆయన వైసీపీని ఏ తీరాలకు చేరుస్తాడో ? చూడాలి.