వైసీపీ నేత‌ల్లో విభేదాలు.. ఎక్క‌డిక‌క్క‌డ సెగ‌లు

ఏ పార్టీలోనైనా అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు స‌హ‌జం.కానీ వాట‌న్నింటిని స‌మ‌న్వ‌యం చేసుకుంటేనే ప‌ట్టుకోల్పోకుండా ఉంటాయి పార్టీలు.

 Differences Among Ycp Leaders, Chauda Varapu Jagadish, Mla Udayabhanu, Mayor Noo-TeluguStop.com

ఇక ఏపీలో అధికార పార్టీ వైసీపీలో నాయ‌కులు అంత‌ర్గ‌త కుమ్ముల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ని అంటున్నారు విశ్లేష‌కులు.ఏంటంటే.

ఎమ్మెల్యేల నుంచి జిల్లా స్థాయి నాయకుల వరకు కూడా ఇదే ప‌రిస్థితి ఉంద‌ట‌.అంతర్గత వ్యవహారాలతో ఒకరిపై ఒకరు బ‌హిరంగంగానే విమ‌ర్శించుకుంటున్నారు.

అంతేకాదు వివాదాలు.విభేదాలను మీడియా ముందుకు కూ డా లాగుతున్నారు.

దీంతో పార్టీకి మరింత ఇబ్బందిగా మారింది.కేవలం వారం వ్యవధిలో నాలుగు జిల్లాల్లో చోటు చేసుకున్న పరిణామాలే అందుకు ఉదాహార‌ణ‌.

కృష్ణా జిల్లాల్లో

ఉమ్మడి కృష్ణా జిల్లా జగ్గయ్య పేట వైసీపీ పట్టణ అధ్యక్ష పదవికి మునిసిపల్ కో-ఆప్షన్ సభ్యత్వానికి చౌడ వరపు జగదీష్ రాజీనామా చేశారు.2003 నుంచి ఆయన ఎమ్మెల్యే ఉదయభాను వెంట ఉన్నారు.అయితే.కొంతకాలంగా ఉదయభాను చుట్టూ ఉన్న అనుచ‌ర గ‌ణం లేనిపోని విభేదాలు సృష్టిస్తోందని ఆయన దృష్టికి సమస్యలు తీసుకెళదామన్నా ఉదయభానుకు తీరిక ఉండటం లేదనేది జగదీష్ ఆరోపిస్తున్నాడు.

ఈ క్రమంలోనే పార్టీ అధ్యక్ష పదవికి జగదీష్ రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు.మ‌రో విష‌యం ఏంటంటే స్థానిక నాయకత్వమే ఆయనను దూరం చేసిందనే వాదన వినిపిస్తోంది.

ఏలూరు జిల్లాలో

ఏలూరు జిల్లాలో తాజాగా వెలుగు చూసిన ఘటన నివ్వెర పోయేలా చేసింది.వైసీపీకి చెందిన కార్పొరేటర్ ఒకరు.

కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతి బాహాటంగానే మీడియా ముందు వెల్ల‌డించారు.మేయర్ నూర్జహాన్.

ఆమె భర్త అనధికార మేయర్ గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న తనలాంటి వారికి ఎలాంటి ప్రాధాన్యం దక్కడం లేదని మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవినీతి పెరిగిపోయిందని.కార్పొరేషన్ స్థలాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేసి.

నచ్చిన వారికి ఇచ్చేస్తున్నారని.ఇదే మని అడిగితే.

దౌర్జన్యాలకు పాల్ప‌డుతున్నార‌ని ఆరోపించారు.

Telugu Chaudavarapu, Eluru, Kakinada, Krishna, Mayor Noorjahan, Mla Udayabhanu,

కాకినాడ‌లోనూ

కాకినాడ జిల్లాలోనూ వైసీపీ నేతల మధ్య అసమ్మతి స్వ‌రం వినిపించింది.ఏకంగా.మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడిపైనే.

సొంత పార్టీ నాయకుడు తీవ్ర విమర్శలు చేశారు.పినిపే విశ్వరూప్ కుమారుడు కృష్ణారెడ్డి కక్ష కట్టి తమ అబ్బాయి సుభాష్ ను అమలాపురం అల్లర్ల కేసులో ఇరికించారని అమలాపురం పట్టణ వైసీపీ నాయకుడు వాసంశెట్టి సుభాష్ తండ్రి సత్యం ఆరోపించారు.

తమ ఇంటి పై దాడి చేసేందుకు ప్రయత్నం చేశారని వెల్లడించారు.మంత్రి విశ్వరూప్ తమకు కోట్లలో అప్పులు ఉన్నారని వాటిని ఎగ్గొట్టేందుకే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.

మంత్రి కుమారుడి నుంచి ప్రాణభయం ఉందని అన్నారు.ఇక గుంటూరు కృష్ణాలోని పలు నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంద‌ట‌.

మ‌రి ఎన్నిక‌ల నాటికి ఇదే ప‌రిస్థితి ఉంటే పార్టీకి న‌ష్టం జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube