రౌడీస్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాని ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.
ఇదిలా ఉంటే మాఫియా, బాక్సింగ్ నేపధ్యంలో ఉండే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఎప్పుడో లాక్ డౌన్ కి ముందే కంప్లీట్ అయిపొయింది.అయితే తరువాత కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పడ్డ షూటింగ్ మరల ఇప్పటి వరకు స్టార్ట్ కాలేదు.
అన్ని సినిమాలు లాక్ డౌన్ తర్వాత మరల యధావిధిగా షూటింగ్ జరుపుకొంటున్నాయి.అయితే ఫైటర్ సినిమాని అప్పుడు, ఇప్పుడు అంటున్న ఇప్పటి వరకు ఎలాంటి షూటింగ్ అప్డేట్ పూరి టీం నుంచి రాలేదు.
అయితే దీనికి ముందుగా ఏవేవో కారణాలు వినిపించాయి.కరణ్ జోహార్ ప్రస్తుతం తన దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్రహ్మాస్త్ర సినిమా మీద ఫోకస్ పెట్టడంతో ఫైటర్ ని హోల్డ్ లో పెట్టటానికి ఈ కారణంగా ఆలస్యం అవుతుందని టాక్ నడిచింది.
అయితే ఇప్పుడు మరో వార్త వినిపిస్తుంది.ఈ సినిమా ముంబై, అలాగే ఫారిన్ బ్యాక్ డ్రాప్ లో ఎక్కువ భాగం షూటింగ్ జరపాల్సి ఉంది.అలాగే సినిమాలో యాక్షన్ సిక్వీన్స్ కోసం ఫారిన్ ఫైటర్స్ ని ఉపయోగించాల్సి ఉంది.అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితులు ఇండియాలో కొంత వరకు కుదుటపడింది విదేశాలలో మాత్రం ఇంకా ఇబ్బందికరంగానే ఉంది.
ఈ కారణంగా మరికొంత కాలం వేచి చూడాలని పూరి అనుకున్నట్లు తెలుస్తుంది. విదేశీ ఫైటర్స్ ని ఇప్పుడు తీసు కొచ్చిన మధ్యలో ఎవరికైనా కరోనా వస్తే మొత్తం షూటింగ్ కి ఇబ్బంది అవుతుందని, అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకొని షూట్ కి వెళ్లాలని పూరి భావిస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ నేపధ్యంలో వచ్చే ఏడాదిలోనే ఫైటర్ షూటింగ్ కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది.