Rashmika : రష్మిక కి మా ఇంటి కోడలయ్యే అర్హత లేదు.. విజయ్ దేవరకొండ తల్లి షాకింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్ లో గత కొద్ది రోజులుగా రష్మిక మందన్న ( Rashmika Mandanna ) విజయ్ దేవరకొండ ఇద్దరు రిలేషన్ లో ఉన్నారని వార్తలు వినిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

వీరిద్దరూ కలిసి వెకేషన్ లకి వెళ్ళినా కూడా ఎక్కడ మీడియా కంట పడకపోయినా సరే వీరిద్దరూ షేర్ చేసే ఫోటోలను గుర్తుపట్టిన నెటిజన్లు వీళ్ళిద్దరూ కలిసే వెకేషన్లకు,టూర్లకు వెళ్తున్నారని భావిస్తారు.

అంతేకాదు ఇప్పటికే చాలాసార్లు రష్మిక మందన్న విజయ్ దేవరకొండ ( Vijay deverakonda ) మీడియా ముందు అడ్డంగా బుక్కయ్యారు.ఇక వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని కూడా గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది.

ఇలాంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ తల్లి రష్మిక కి మా ఇంటి కోడలుగా అయ్యే అర్హత లేదు అంటూ మాట్లాడినట్టు వార్తలు వస్తున్నాయి.ఇక దీనికి ప్రధాన కారణం ఈ మధ్యకాలంలో రణబీర్ కపూర్ రష్మిక మందన్న కలిసి చేసిన యానిమల్ మూవీ టీజర్ విడుదలైంది.ఇక ఈ టీజర్ లో రష్మిక మందన్నా రెచ్చిపోయి మరీ రణబీర్ కపూర్ ( Ranbir kapoor) తో లిప్ కిస్ సన్నివేశాలలో నటించింది.

అయితే ఈ వీడియోలు,ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో రష్మిక మందన్నా ట్రోల్స్ కి గురవుతుంది.అయితే ఇది కాస్త విజయ్ దేవరకొండ తల్లి కంట్లో పడడంతో ఇలాంటి అమ్మాయి మా ఇంటి కోడలుగా అస్సలు పనికిరాదు.

Advertisement

మొన్నటి వరకు కేవలం మా కొడుకు సినిమాల్లో మాత్రమే అలా చేస్తుంది అనుకున్నాం.కానీ ఇలా పరాయి మగవారితో రెచ్చిపోయి రొమాన్స్ చేస్తే మాత్రం నా కొడుకుకి వద్దు.

అసలు ఆ హీరోయిన్ మా ఇంటి కోడలుగా అవసరం లేదు అని రష్మిక మందన్న ( Rashmika mandanna ) పై మండిపడినట్లు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఇందులో ఉన్నది ఎంత నిజమో తెలియదు కానీ ఈ విషయం తెలిసిన కొంతమంది నేటిజన్లు మాత్రం రష్మిక మందన్నా కి సపోర్ట్ గా నిలుస్తూ నీ కొడుకు చేస్తే ఏం కాదు కానీ ఈ హీరోయిన్ చేస్తే తప్పా అంటూ ఏకిపారేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు