Vijay Devarakonda : కుర్ర దర్శకులకు వరసగా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న విజయ్ దేవరకొండ ..ప్లాన్నింగ్ అదుర్స్ !

లైగర్ సినిమా పరాజయం పూర్తిగా విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) ప్లానింగ్ నే మార్చేసింది.

పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందు బొక్క బోర్లా పడటంతో ఈ సారి ప్లాన్ చేస్తే అది ఖచ్చితంగా విజయం సాధించి తీరాలని భావించాడో ఏమో తెలియదు కానీ సీనియర్ దర్శకులను పక్కన పెట్టాలని నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.

సుకుమార్, కొరటాల శివ ( Sukumar, Koratala Shiva )లాంటి దర్శకులు విజయ్ దేవరకొండ తో సినిమా చేయాలని ఉందని పబ్లిక్ గా అనౌన్స్ చేశాక కూడా వారిని విజయ్ పట్టించుకోవడం లేదు.లైగర్ సినిమా తర్వాత ఖుషి చిత్రంతో విజయ్ దేవరకొండ పర్వాలేదనిపించాడు.

ఇక ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు మరోసారి రానున్నాడు విజయ్ దేవరకొండ.ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

పరశురాం( Parasuram ) ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు అన్న విషయం మనకు తెలిసిందే.

Advertisement

ఇకక ఈ సినిమా తర్వాత అతడు గౌతం తిన్ననూరి( Gautam Tinnanuri ) దర్శకత్వంలో మరో చిత్రం చేయాల్సి ఉంది.ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే సీనియర్ డైరెక్టర్స్ కి అవకాశం ఇవ్వకుండా కుర్ర దర్శకులతోనే సినిమాలు తీయాలని ఫిక్స్ అయ్యాడట.అందుకే తెలుగు, కన్నడ మరియు తమిళ దర్శకుల కథలను వరుసగా వింటున్నాడట.

ఈ క్రమంలో మూడు వరుస సినిమాలను ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది.తెలుగులో రాజా వారు రాణి గారు అనే సినిమాకు దర్శకత్వం వహించిన రవి కిరణ్ కోలా( Ravi Kiran Kola ) డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండగా ఒక సినిమా తీయాలని కన్ఫర్మ్ చేసుకున్నాడట విజయ్.

ఇక తమిళ్లో ఇప్పుడిప్పుడే సినిమాలు తీస్తున్న కెప్టెన్ మిల్లర్ ఫెమ్ అరుణ్ మతేశ్వరన్ ( Arun Mateswaran ) డైరెక్షన్ లో కూడా మరో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట.

అలాగే కన్నడలో సినిమాలు తీస్తున్నటువంటి నార్తన్( Northen ) అనే డైరెక్టర్ కి కూడా ఒక సినిమాకు విజయ్ కమిట్ అయ్యాడట.ఇలా ఆ కుర్రదర్శకులను లైన్ లో పెడుతున్న విజయ్ తెలుగులో సీనియర్ దర్శకులను కూడా పక్కన పెట్టేస్తున్నాడు.అలా లైగర్ సినిమా ప్రభావం విజయ్ దేవరకొండపై పూర్తిగా ఉందని ఫిలిమ్స్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఫ్రీ టైమ్‌లో నన్ను చూసి నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతా : నాని
ఆ మూవీ విషయంలో చేసిన తప్పే ఇప్పుడు చేస్తున్న నాని.. ఇంత నిడివి అవసరమా అంటూ?

పైగా లైగర్ సినిమా తర్వాత ఖుషి కూడా పరవాలేదు అనిపించుకున్న ఒక అర్జెంటు బ్లాక్ బాస్టర్ హిట్టు కోసం విజయ్ ఎదురు చూస్తున్నాడు.మరి ఈ దర్శకులైన అతనికి విజయాన్ని ఇస్తారో లేదో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు