గ్యాప్‌ ఫిల్ చేసేందుకు తెగ కష్టపడుతున్న రౌడీ స్టార్‌

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ( Vijay devarakonda )లైగర్ సినిమా తర్వాత వెంటనే మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నించాడు.శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా( Kushi ) ను చేస్తున్న విజయ్ దేవరకొండ ఈ ఏడాది ఆరంభంలోనే ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాల్సి ఉంది.

 Vijay Devarakonda Back To Back Movies Next Year-TeluguStop.com

కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది.వచ్చే నెలలో ఖుషి చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

ఆ సినిమా తర్వాత పెద్దగా గ్యాప్ లేకుండానే పరశురాం దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు విజయ్ దేవరకొండ రెడీ అవుతున్నాడని తెలుస్తోంది.

Telugu Kushi, Liger, Mrunal Thakur, Parashuram, Samantha, Tollywood-Movie

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతున్న పరశురాం సినిమా( Parasuram movie ) వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి నెలలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని చిత్ర యూనిట్ సభ్యులు చెప్తున్నారు.అంతే కాకుండా గౌతం తిన్ననూరి దర్శకత్వంలో కూడా ఒక సినిమాను చేయబోతున్న విజయ్ దేవరకొండ ఆ సినిమాతో 2024 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.మొత్తానికి ఏడాది గ్యాప్ లో విజయ్ దేవరకొండ మూడు సినిమాలను విడుదల చేయబోతున్నాడని ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Kushi, Liger, Mrunal Thakur, Parashuram, Samantha, Tollywood-Movie

.గత చిత్రం చేదు అనుభవాన్ని మిగల్చడంతో సంవత్సరానికి పైగా గ్యాప్ తీసుకున్న విజయ్ దేవరకొండ ఆ గ్యాప్ ను ఫిల్ చేయడం కోసం ఇలా సంవత్సరంలో మూడు సినిమాల్లో సందడి చేసేందుకు ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.మరి ఈ మూడు సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి. ఖుషి సినిమా లో విజయ్ కి జోడీగా సమంత( Samantha ) నటించిన విషయం తెల్సిందే.

ఇక పరశురామ్ సినిమా లో ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur )నటిస్తోంది.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ రెండు సినిమా ల ఫలితాలపై విజయ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube