గ్యాప్‌ ఫిల్ చేసేందుకు తెగ కష్టపడుతున్న రౌడీ స్టార్‌

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda )లైగర్ సినిమా తర్వాత వెంటనే మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నించాడు.

శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా( Kushi ) ను చేస్తున్న విజయ్ దేవరకొండ ఈ ఏడాది ఆరంభంలోనే ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాల్సి ఉంది.

కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది.వచ్చే నెలలో ఖుషి చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

ఆ సినిమా తర్వాత పెద్దగా గ్యాప్ లేకుండానే పరశురాం దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు విజయ్ దేవరకొండ రెడీ అవుతున్నాడని తెలుస్తోంది.

"""/" / ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతున్న పరశురాం సినిమా( Parasuram Movie ) వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి నెలలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని చిత్ర యూనిట్ సభ్యులు చెప్తున్నారు.

అంతే కాకుండా గౌతం తిన్ననూరి దర్శకత్వంలో కూడా ఒక సినిమాను చేయబోతున్న విజయ్ దేవరకొండ ఆ సినిమాతో 2024 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

మొత్తానికి ఏడాది గ్యాప్ లో విజయ్ దేవరకొండ మూడు సినిమాలను విడుదల చేయబోతున్నాడని ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

"""/" / .గత చిత్రం చేదు అనుభవాన్ని మిగల్చడంతో సంవత్సరానికి పైగా గ్యాప్ తీసుకున్న విజయ్ దేవరకొండ ఆ గ్యాప్ ను ఫిల్ చేయడం కోసం ఇలా సంవత్సరంలో మూడు సినిమాల్లో సందడి చేసేందుకు ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.

మరి ఈ మూడు సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.ఖుషి సినిమా లో విజయ్ కి జోడీగా సమంత( Samantha ) నటించిన విషయం తెల్సిందే.

ఇక పరశురామ్ సినిమా లో ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur )నటిస్తోంది.

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ రెండు సినిమా ల ఫలితాలపై విజయ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు.