ఒకప్పుడు రాజకీయాల్లో పాటించే సాంప్రదాయాలన్నీ ఇప్పుడు చేల్లని చిత్తు కాగితాలు అయిపోయాయి.రాజకీయ నాయకులు కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే స్తానే ఈరోజు తెల్లారే లెగిస్తే అవతలి వర్గం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని భూతద్దంలో చూసి విమర్శించడం, రాజకీయ ప్రత్యర్థులను వ్యక్తిగత ప్రత్యర్థులు గా చూడటం లాంటి వ్యవహారాలు నిత్య కృత్యమైపోయాయి.
ముఖ్యంగా గడిచిన 10 సంవత్సరాలు గా ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.చిత్తూరు లోని కుప్పం సీటు ప్రతిపక్ష నేత చంద్రబాబుకు( Chandrababu Naidu ) దశాబ్దాలుగా కంచుకోటలా వస్తుంది.
అలాంటి సీటులో చంద్రబాబు ని ఓడించాలని జగన్( CM Jagan ) ప్రతిన పూనారు.వై నాట్ కుప్పం? అంటూ గట్టిగా సౌండ్ చేశారు.దానికి తగ్గట్టుగానే కుప్పం స్థానిక సంస్థల ఎన్నికలలో వైసిపి కూడా విజయభేరి సాగించింది.దాంతో ఇక వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును కుప్పంలో ఓడించాలని 175 సీట్లలో వైసీపీని గెలిపించుకోవాలంటూ జగన్ దిశా నిర్దేశం చేస్తున్నారు.
ఇప్పుడు జగన్ ఫార్ములానే టిడిపి కూడా వైసిపి పై ప్రయోగిస్తున్నట్లుగా తెలుస్తుంది.వై నాట్ పులివెందుల( Why Not Pulivendula ) అన్న స్లోగన్ను చంద్రబాబు కొత్తగా ఎత్తుకున్నారు.జగన్ పరిపాలనలో రాయలసీమకు ఒరిగిందేమి లేదని సాక్షాలతో సహా నిరూపించే పనిలో పడ్డారు.ముఖ్యంగా సాగునీటి తాగునీటి ప్రాజెక్టుల విషయంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యమని, కనీసం తెలుగుదేశం హయాంలో జరిగిన పనుల్లో పదోవంతో కూడా వైసిపి హయాంలో జరగలేదని, సాక్షాలతో సహా నిరూపించే పనిలో పడింది తెలుగుదేశం మీడియా.
చంద్రబాబు నాయుడు కూడా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం వైఫల్యాలు ఎండగట్టే పనులకు శ్రీకారం చుట్టారు.ఈరోజు పులివెందులలో భారీభారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్న చంద్రబాబు జగన్ వల్ల ఈ నియోజకవర్గం వర్గానికి జరిగిన అభివృద్ధి శూన్యమని తెలుగుదేశానికి అవకాశం ఇచ్చి జగన్ ఇంటికి సాగనంపాలంటూ పిలుపు ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.అయితే ఈ దుష్ట సాంప్రదాయాన్ని జగనే మొదలుపెట్టారని, ఇప్పుడు టిడిపి దాన్ని పాటిస్తుందని అందువల్ల జగన్ మూల్యం చెల్లించాల్సి వస్తుందంటూ తెలుగుదేశం నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.