అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండ అనంతరం వరుస సినిమా అవకాశాలను అందుకొని ప్రతి సినిమాలను తన మార్క్ ఏంటో చూపిస్తున్నారు.ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న విజయ్ దేవరకొండ ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో లైగర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇలా ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ సినిమాల్లోకి రాకముందే చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారనే విషయం చాలా మందికి తెలియదు.
తాజాగా ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ సినిమాలలోకి రాకపోతే చిన్నప్పుడే ఒక సీరియల్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించినట్లు వెల్లడించారు.
విజయ్ దేవరకొండ తన పాఠశాల విద్యను ఆంధ్ర ప్రదేశ్ లోని పుట్టపర్తిలో శ్రీ సత్య సాయి హయ్యర్ సెకండరీ స్కూల్లో చదివారు.అయితే ఇక్కడ చదువుతున్న సమయంలో సత్య సాయిబాబా జీవిత చరిత్ర గురించి ఒక తెలుగు సీరియల్ నిర్మించారు.
ఈ సీరియల్ లో భాగంగా ఈయన నటించినట్లు ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ఆ వీడియోని షేర్ చేస్తూ తాను చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించినట్లు తెలిపారు.

ఈ విధంగా విజయ్ దేవరకొండ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారని తెలియడమే కాకుండా ఆయన చిన్నప్పటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇకపోతే ఈయన లైగర్ సినిమా ద్వారా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు.సినిమాల విషయానికొస్తే పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన సినిమాలో నటిస్తున్నారు.
అదేవిధంగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖుషి సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు.