Vijay Ranjithame Song :టాప్ 2 ట్రెండింగ్ లో వరిసు 'రంజితమే'.. ఇప్పటికి ఎన్ని మిలియన్స్ క్రాస్ చేసిందంటే?

కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా వారసుడు.

తమిళ్ లో వరిసు అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ క్రేజీ సినిమాపై ఇప్పటికే తమిళ్ లో అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.

టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.తమిళ్ లో తిరుగులేని ఫాలోయింగ్ తెచ్చుకున్న విజయ్ ఇప్పుడు తెలుగులో కూడా మెప్పించడానికి టాలీవుడ్ డైరెక్టర్ తో రాబోతున్నాడు.

కానీ ఇది తెలుగు సినిమా కాకపోవడంతో ఇక్కడ ఇప్పటి వరకు పెద్ద అంచనాలు అయితే రాలేదు.ముందు బైలింగ్వన్ సినిమా అని చెప్పిన మేకర్స్ ఇటీవల డైరెక్ట్ తమిళ్ సినిమా అని చెప్పడంతో తెలుగు ప్రేక్షకులు అయితే ఈ సినిమాపై గుర్రుగా ఉన్నారు.

ఇదిలా ఉండగా ఇటీవలే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ వచ్చింది.థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి రంజితమే అనే సాంగ్ రిలీజ్ చేయగా అది సోషల్ మాధ్యమాలను షేక్ చేస్తుంది.

Advertisement
Vijay And Rashmika Mandanna Varisu First Single Details, Rashmika Mandanna, Ran

ఈ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలువగా యూట్యూబ్ లో ఇప్పటికి ట్రెండింగ్ లో కొనసాగుతుంది.గ్లోబల్ గా కూడా ఈ సాంగ్ టాప్ 2 స్థానంలో ట్రెండ్ అవుతుంది.

దీంతో ఈ విషయాన్ని థమన్ సోషల్ మీడియా వేదికగా తెలిపి సంతోషం వ్యక్తం చేసాడు.

Vijay And Rashmika mandanna Varisu First Single Details, Rashmika Mandanna, Ran

ఇక ఈ సాంగ్ ప్రెజెంట్ 58 మిలియన్ వ్యూస్ రాబట్టి 60 మిలియన్ వ్యూస్ దిశగా సాగుతుంది.ఇక ముందు ముందు ఎన్ని మిళియన్స్ కు చేరుకుంటుందో చూడాలి.ఇక దిల్ రాజు భారీ స్థాయిలో శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

సంక్రాంతి కానుకగా 2023 జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.చూడాలి ఈ సినిమా ఎలా ఉంటుందో.

వైరల్ వీడియో : ఏంటి భయ్య.. కోడిని పట్టుకున్నట్లు చిరుతను అలా పట్టేసావ్..
Advertisement
Loading video

తాజా వార్తలు