వైద్యం లో తెలంగాణ దేశంలో మూడో స్థానం చివరి స్థానంలో డబుల్ ఇంజిన్ సర్కారు డబుల్ ఇంజిన్ ఒక పెద్ద ట్రబుల్ ఇంజిన్పే దలకు ఎలాంటి లాభం లేదు, ప్రయోజనం లేదు రెండు మూడు రోజుల్లో 58 టిఫా ప్రారంభం ఆర్థిక, అరోగ్య మంత్రి హరీశ్ రావు బాగ్ లింగం పల్లి లోని, కళాభవన్ లో 2 వ ఏఎన్ఎం 2వ మహాసభల్లో పాల్గొన్న ఆర్థిక, అరోగ్య మంత్రి హరీశ్ రావు.
మంత్రి కామెంట్స్.
ఇవాళ మీరు రెండో మహా సభలు జరపడం సంతోషం.మీకు అభినందనలు.
కరోనా సమయంలో మీరు మంచి సేవలు అందించారు.మీ సేవలు అమూల్యం.
కరోనా సమయంలో ముగ్గురు పని చేశారు.వైద్యారోగ్య, పారిశుద్ధ్య, పోలీసులు పని చేశారు.
ప్రాణాల్ని సైతం లెక్క చేయలేదు.అలాంటి ప్రయత్నం లో కొందరు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం.
ప్రాథమిక వైద్యం అందించడంలో మీది కీలక పాత్ర ప్రివెన్శన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు అందులో మీది కీలక పాత్ర.బీపీ, షుగర్, కేన్సర్ వ్యాది ఉన్నట్లు చాలా మందికి తెలియదు.
వారిని గుర్తించి, ముందుగా చికిత్స అందిస్తే, దీర్ఘ కాల రోగాలు రావు.
మీరు ఎంత బాగా పని చేస్తే, అంత మంచి రాష్ట్రం అవుతుంది.
హైదరాబాద్ లో 350 బస్తీ దవాఖానలు సూపర్ హిట్ అయ్యాయి.బస్తీ దవాఖానల వల్ల గాంధీ, ఉస్మానియ, ఫీవర్ ఆసుపత్రుల్లో ఓపీ తగ్గింది.
జిల్లాలో కూడా బస్తీ దవాఖానలు పెడుతున్నాం.మొత్తం 500 ఏర్పాటు చేస్తున్నాం.
ఎ ఎన్ ఏం సెంటర్లను పల్లె దవాఖనలుగా అప్ గ్రేడ్ చేస్తున్నాం.ఈ నెలలో 2000 పల్లె దవాఖాన లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుకోబోతున్నాము.2004 లో సర్కారు వైద్యం ఎలా ఉందో.ఇపుడు ఎలా ఉందో దానికి మీరే సాక్ష్యం.
తెలంగాణ వచ్చిన నాడు 5 మెడికల్ కాలేజ్ లు ఉంటే, ఇప్పుడు 17 కు పెరిగాయి.
వైద్యం అందుబాటులోకి వచ్చింది.
వచ్చే ఏడాది మరో 9 చేస్తున్నాం.పేదవాడు గతంలో ఉస్మానియా, గాంధీ వెళ్ళేవారు.ఈ తరహా వైద్యం మీ జిల్లాలోనే అందుబాటులోకి వచ్చింది.2014 లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతం డెలివరీలు 67 శాతం కు పెరిగాయి.మెదక్ జిల్లాలో 78 శాతం అవుతున్నాయి.మరో జిల్లాలో 82 శాతం ఉంది.ఇందులో మీ అందరి కష్టం ఉంది.మనందరి కృషి.
ఎన్ని మంచి పనులు చేసినా ఒక్క తప్పు మొత్తం వ్యవస్థకు చెడ్డ పేరు తెస్తుంది.అందుకే ఎక్కడా తప్పు జరగకుండా చూసుకుందాం.
వైద్యం లో తెలంగాణ దేశంలో మూడో స్థానంలో ఉన్నాం.డబుల్ ఇంజిన్ సర్కారు చివరి స్థానంలో ఉంది.
డబుల్ ఇంజిన్ ట్రబుల్ ఇంజిన్ తప్ప పేదలకు ఎలాంటి లాభం లేదు.రెండు మూడు రోజుల్లో 58 టిఫా ప్రారంభం జనవరి వరకు అన్ని జిల్లాల్లో టి డయాగ్నొస్టిక్ కేంద్రాల ఏర్పాటు
అనవసర సి సెక్షన్లు చాలా తగ్గాలి.
మీకు పంపిన వీడియోలు వారికి చూపించాలి.కౌన్సిలింగ్ ఇవ్వాలి.
లేదంటే తల్లికి బిడ్డకు ఇబ్బంది అవుతుంది.దీర్ఘకాల సమస్యలు ఎదురవుతాయి.
ఎంతో విలువైన ముర్రు పాలు మొదటి గంటలో బిడ్డకు అందదు.మీ పరిధిలో వంద శాతం డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరగాలి.
ఆరోగ్య శ్రీ కింద 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నాం.అన్ని ఆసుపత్రుల్లో డయాలసిస్ సేవలు ఏర్పాటు చేస్తున్నాం.
రాబోయే రోజుల్లో కీమో, రెడీయో థెరపీ తెస్తున్నాం.అన్ని చోట్ల ఎ ఎన్ ఏం సబ్ సెంటర్ లలో బిల్డింగ్ కడుతున్నం.
మీకు ఇబ్బందులు తీరుతాయి.కరోనా తర్వాత వేయిటేజే ఇస్తున్నాం.
ఒక ఏడాదికి 2 మార్కులు కలుపుతున్నం.మొదటి ఎ ఎన్ ఎం ఖాళీలు ఉన్నాయి.
నెలా రెండు నెలల్లో నోటిఫికేషన్ ఇస్తాం.టివీవీపీ లో 228 ఉద్యాగ్గాలు ఇస్తే 200 మీకే వచ్చాయి.
పూర్తి స్థాయిలో పూర్తి ఏజ్ రిలాక్సేశన్ ఇస్తాము.జీతాల కోసం గతంలో ధర్నాలు చేసే వారు, గుర్రాలతో తొక్కించిన చరిత్ర వారిది.
మేము సకాలంలో జీతాలు ఇస్తున్నాం.జీతాలు పెంచాము.
ప్రజల కోసమే మనం పని చేస్తున్నాం.మీరు అద్భుతంగా పని చేస్తున్నారు నాకు ఎలాంటి డౌట్ లేదు.
అరోగ్య తెలంగాణ నిర్మాణంలో కలిసి శ్రమిద్దాం.