Vidyut jammwal : అదేంటి ఎంగేజ్మెంట్ చేసుకోవాల్సిన జంట.. ఉన్నట్టుండి బ్రేకప్ చెప్పుకోవడం ఏంటి?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లి విడాకులు ఇవన్నీ సర్వసాధారణం అని చెప్పవచ్చు.

కీళ్ల తరబడి ప్రేమించుకున్న ప్రేమ జంటలు పెళ్లి చేసుకుని కొద్దిరోజులు కూడా కలిసి కాపురం చేయలేక విడాకులు తీసుకొని విడిపోతూ ఉంటారు.

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఎక్కువగా విడాకులు తీసుకొని విడిపోయి అభిమానులకు సాగిస్తున్నారు.కొంతమంది సెలబ్రిటీలు ప్రేమ ఎంగేజ్మెంట్ కు ముందే కలిసి వెకేషన్ లోకి వెళ్లడం పార్టీలకు వెళ్లడం ఎంజాయ్ చేయడం లాంటివి చేసి ఆఖరి నిమిషంలో ఎంగేజ్మెంట్ పెళ్లిళ్లు క్యాన్సిల్ చేసుకుంటున్నారు.

సినిమా ఇండస్ట్రీలో త్రిష, అఖిల్,విశాల్,మెహ్రిన్, రష్మిక లాంటి సెలబ్రిటీలు ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేసుకున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ లిస్టులోకి బాలీవుడ్ హీరో విద్యుత్ జమ్వాల్( Vidyut jammwal ) కూడా చేరిపోయారు.కాగా జమ్వాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.

ఇప్పటికే తెలుగులో ఊసరవెల్లి సికిందర్ లాంటి సినిమాలలో నటించి మెప్పించాడు.అలాగే బాలీవుడ్( Bollywood ) లో కూడా పలు సినిమాలలో నటించి మెప్పించాడు.

Advertisement

ఇకపోతే హీరో జమ్వాల్ గత కొన్నిల్లుగా నందిత మహ్తానీ( Nandita mahtani ) ఫ్యాషన్ డిజైనర్ తో ప్రేమలో మునిగి తేలుతున్న విషయం మనందరికీ తెలిసిందే.

అంతేకాకుండా వీరిద్దరూ చట్టాపట్టాలేసుకుని బీచ్ లు, రెస్టారెంట్ లు, వెకేషన్ లు అంటూ ఫుల్ గా తిరిగి ఎంజాయ్ చేశారు.ఇది ఇలా ఉంటే గత ఏడాది ఈ జంట తాజ్ మహల్ వద్ద నిలబడి వారి ప్రేమను వ్యక్తపరచిన విషయం మనందరికీ తెలిసిందే.అంతేకాకుండా ప్రేమలో మునిగి తేలుతున్నట్లు అభిమానులతో తెలిపారు.

దాంతో ఈ జంట నిశ్చితార్థం చేసుకోనుంది కొద్దిరోజుల్లోనే పెళ్లి పీటలు ఎక్కనుంది అంటూ కూడా వార్తలు వినిపించాయి.ఈ జంట ఊహించని విధంగా బ్రేకప్ చేసుకున్నట్టుగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా ఇద్దరు ఎవరికి వారుగా సోషల్ మీడియాలో బ్రేకప్ కోట్స్ పెడుతూ ఇంస్టాగ్రామ్ ని హీటెక్కిస్తున్నారు.మరోవైపు అనన్య పాండే కజిన్ పెళ్లిలో కూడా ఇద్దరూ ఎడమొహం పెడమొహం గా కనిపించడంతో ఆ వార్తలకు మరింత ఆజ్యం చేకూర్చినట్టు అయింది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవం సినిమాతో సక్సెస్ సాధిస్తాడా..?
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో కొత్త సినిమాకి కమిట్ అయిన రవితేజ...డైరెక్టర్ ఎవరంటే..?

ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాలి అంటే ఈ జంట స్పందించేంతవరకు వేచి చూడాల్సిందే మరి.

Advertisement

తాజా వార్తలు