కరోనాకి థాంక్స్ చెప్పిన విద్యా బాలన్! విమర్శలు గుప్పిస్తున్న నెటిజన్లు

కరోనా వైరస్ కారణంగా ప్రజలందరూ భయంతో తీవ్ర ఆందోళనకి గురవుతున్నారు.మరి కరోనా నియంత్రణకి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటూ లాక్ డౌన్ ప్రకటించింది.

అయితే ఈ కరోనా కారణంగా మొత్తం ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థ మొత్తం ఆగిపోయింది.దీంతో కొన్ని లక్షల వాహనాలతో ట్రాఫిక్, కాలుష్యంతో స్తంభించిపోయే నగర వాసి జీవితం ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది.

ఎలాంటి సౌండ్, ఎయిర్ పోల్యుషన్ లేకపోవడంతో ప్రకృతి ప్రేమికులు కాస్తా సంతోషం వ్యక్తం చేస్తూ కరోనా రావడం కూడా ఒకందుకు మంచిదే అని అంటున్నారు.ఇలా అంటున్న వారిలో బాలీవుడ్ స్టార్ నటి విద్యా బాలన్ కూడా ఉండటం విశేషం.

తాజాగా ఆమె కరోనాకి థాంక్స్ చెబుతూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.జ‌నాలు ఎక్క‌డిక్క‌డ ఉండిపోవ‌డం, వాహ‌నాలు రోడ్డెక్క‌పోవ‌డం, ఇత‌ర ప‌నుల‌న్నీ ఆగిపోవ‌డంతో కాలుష్యం బాగా త‌గ్గింద‌ని విద్య చెప్పుకొచ్చింది.

Advertisement

గాలి ప్యూరిఫై అయ్యింద‌ని, ఇలాంటి వాతావ‌ర‌ణం ఏర్ప‌డ‌టానికి కార‌ణ‌మైన క‌రోనాకు థ్యాంక్స్ అంటూ విద్యాబాల‌న్ పోస్ట్ చేసింది.అయితే కరోనా కారణంగా శబ్ద, వాయు కాలుష్యం తగ్గిన మాట వాస్తవమే అయిన దానికి థాంక్స్ చెప్పడం నెటిజన్లుకి నచ్చడం లేదు.

కోట్లు సంపాదించి మేడల్లో ఉన్న మీలాంటి వారికి భాగానే ఉంటుంది.కాని ఈ లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి సామాన్య, మధ్యతరగతి ప్రజలకి, రోజువారి కూలీలకి వచ్చింది, కూలి డబ్బుల మీద బ్రతికే మాలాంటి వారి బ్రతుకు మీకుంటే కరోనా మాకు ఎంత నరకమో అనే విషయం తెలిసేది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు